Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ponguleti Srinivasa Reddy : 1000 రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ హిట్.. 'కల్యాణలక్ష్మి, షాదీముబారక్'పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Ponguleti Srinivasa Reddy : 1000 రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ హిట్.. 'కల్యాణలక్ష్మి, షాదీముబారక్'పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

10tv 3 days ago
  • సన్న వడ్లకు రూ.500 బోనస్.. తెలంగాణ రైతులకు భారీ ఊరట
  • రూ.8 లక్షల కోట్ల అప్పులు.. కాంగ్రెస్ పాలనపై పొంగులేటి ఫైర్
  • బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే.. పొంగులేటి సంచలన ఆరోపణలు

Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 1000 రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిందని తెలిపారు.

రాజకీయ బేషజాలకు వెళ్లకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత పాలనలో పేరుకుపోయిన సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్‌ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు.

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ :
వ్యవసాయ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోత్సాహకాలతో తెలంగాణ వరి ఉత్పత్తి పంజాబ్‌ను మించి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు.

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టామని అన్నారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే ప్రజలకు మరింత స్పష్టత వస్తుందన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలను ప్రస్తావిస్తూ పట్టణాలు, గ్రామాల్లో తమ పార్టీ బలపడిందని చెప్పారు.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. కేంద్రంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. బతుకమ్మ చీరల విషయంలోనూ అవినీతి జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సారె రూపంలో మహిళలకు పాలపిట్ట చీరలు అందిస్తున్నామని, భవిష్యత్తులో చిలకపచ్చ చీరలు కూడా అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv