Premane Oorilo : శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ప్రేమనే ఊరిలో. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం నిర్మాణంలో మనోజ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలతో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ ప్రేమనే ఊరిలో సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘Welcome to the Land of Love’ అనే క్యాప్షన్ కూడా ఇవ్వడం గమనార్హం. పోస్టర్ చూస్తుంటే.. పచ్చని పొలాలు, గాలిమరలు, ఎడ్లబండి, పల్లె వాతావరణంతో విలేజ్ స్టోరీ అని తెలుస్తుంది. కన్నడలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది.
KGF, కాంతారా వంటి సినిమాలకు తెలుగులో డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న సురేష్ కొండేటి మరోసారి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


