Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purushaha Review : 'పురుషః' మూవీ రివ్యూ.. భార్యాబాధితులు చూడాల్సిందే.. నవ్వుకోవాల్సిందే..

Purushaha Review : 'పురుషః' మూవీ రివ్యూ.. భార్యాబాధితులు చూడాల్సిందే.. నవ్వుకోవాల్సిందే..

10tv 3 days ago

Purushaha Review : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా 'పురుషః'.

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. పురుషః సినిమా మే 22న రిలీజ్ కానుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. పమ్మి సాయి, విటివి గణేష్, వెన్నెల కిషోర్, గ్యాబి రాక్, రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే..

గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను(కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. వీళ్ళ భార్యలు కమల (రాయంచ) లక్ష్మి (హాసిని), గీత (విషిక)విడాకులు కావాలని కోర్టులో కేసు వేస్తారు కానీ కోర్టుకు రారు. దీంతో కేసు వాయిదా వేస్తూ ఉంటారు. జడ్జి వీళ్ళ కథలని చెప్పమంటాడు. ఈ ముగ్గురికి తమ భార్యలతో ఏవో ఒక గొడవలు వస్తూ ఉంటాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తమ చిన్ననాటి ఫ్రెండ్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు. అక్కడ కిస్సు డైరీలో వీళ్ళ చిన్నప్పటి చిలిపి వేషాలు, ప్రేమకథలు అన్ని భార్యలు చూస్తారు. అలాగే ఆ పెళ్ళికి వచ్చిన దేవిక(anaira guptha) అనే అమ్మాయితో గడిపారని అనుమానంతో ముగ్గురు భార్యలు గొడవ పెట్టుకొని కోర్టులో విడాకులు కావాలని కేసు వేస్తారు.

ఇక గోవింద్ లైఫ్ లో తన కంటే ముందే రోజీ(గ్యాబి రాక్)అనే అమ్మాయి ఉందని తెలిసి మోసం చేసాడని దూరం పెడుతుంది తన భార్య కమల. మరి ఈ ముగ్గురు భార్యలు కోర్టుకు వస్తారా? వీళ్లకు విడాకులు వస్తాయా? లేక భర్తలను అర్ధం చేసుకొని కలుస్తారా? గోవింద్ - రోజీ ప్రేమ కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..

పురుషః అనే టైటిల్, మూవీ యూనిట్ చేసే ప్రమోషన్స్ తో పెళ్లయిన మగవారి ఇబ్బందులను ఈ సినిమాలో కామెడీగా చూపించబోతున్నట్టు అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా భార్యాభర్తల గొడవలు, కోర్టు సీన్స్, ఈ ఫ్రెండ్స్ చేసే కామెడీతో, హీరో ప్రేమకథతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కిస్సు పెళ్ళికి వెళ్లి అక్కడ వీళ్ళ చిలిపి పనులు బయటపడటంతో నెక్స్ట్ ఏం జరిగింది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో గోవింద్ గత ప్రేమకథ, కిస్సు డైరీ బయటపడ్డాక భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు, కోర్టు సీన్ తో నడుస్తుంది.

సొసైటీలో మగవారి కష్టాలను కూడా కామెడీగా చూస్తారు. అలా సినిమాలో కూడా మగవాళ్ళు పడే కష్టాలను కామెడీగానే చూపించారు. అసలు నిజం తెలియకుండా, చెప్పుడు మాటలు విని, ఊహించుకొని భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా వస్తాయి అని చూపించారు. ఎక్కువశాతం ఈ భార్యాభర్తల గొడవలు కామెడీగా చూపించారు. ఈ కామెడీ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గోవింద్ - రోజీ ప్రేమకథ బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించలేము. ఆ ట్విస్ట్ బాగున్నా ఫ్లాష్ బ్యాక్ లో ఏజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా హీరోయిన్ పాత్రని పెడితే బాగుండేది.

హీరో లవ్ బ్రేకప్ తప్ప కొన్ని చోట్ల ఎమోషన్ పండించాలని ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కోసం ముగ్గురు హీరోలు సూపర్ హీరోలుగా మారి భార్యలతో యుద్ధం చేసినట్టు చూపించారు కానీ అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చిన్నప్పుడు, కాలేజీ ఏజ్ లో అందరి లైఫ్ లో చిలిపి పనులు ఉంటాయి. వాటికే విడాకులు కావాలని వెళ్తారా అనేది స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించేసినట్టు అనిపిస్తుంది.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv