Dailyhunt
Rajasekhar: బైక్ ఫ్యాక్టరీ ఓనరైనా.. నా గోటీల ఫ్యాక్టరీని వదలను.. రాజశేఖర్ ఫన్నీ కామెంట్స్ వైరల్

Rajasekhar: బైక్ ఫ్యాక్టరీ ఓనరైనా.. నా గోటీల ఫ్యాక్టరీని వదలను.. రాజశేఖర్ ఫన్నీ కామెంట్స్ వైరల్

10tv 1 week ago
  • బైకర్ సక్సెస్ మీట్ లో రాజశేఖర్ పంచులు
  • గోటీల ఫ్యాక్టరీపై కామెంట్స్ తో నవ్వులే నవ్వులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Rajasekhar: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'.

ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారతదేశపు తొలి మోటోక్రాస్ సినిమాగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక సినిమాకు వస్తున్న పాజిటీవ్ రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది.

Kiran Abbavaram: దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. తొలి అడుగు 'రియాలిటీ'తోనే

ఈ వేడుకలో రాజశేఖర్(Rajasekhar) తనదైన శైలిలో కామెడీ పంచులు వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ఒక విలేకరి సరదాగా మాట్లాడుతూ.. 'సినిమా పెద్ద హిట్ అయ్యింది కదా, ఇక బైక్ ఫ్యాక్టరీ ఓనర్ అయిపోతారేమో' అని ప్రశ్నించారు. దానికి రాజశేఖర్ స్పందిస్తూ, “బైక్ ఫ్యాక్టరీ ఓనర్ అయినా కాకపోయినా.. నా గోటీల ఫ్యాక్టరీని మాత్రం ఎప్పటికీ వదలను” అని బదులిచ్చారు. దాంతో ఒక్కసారిగా ఆ హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది.

గతంలో రాజశేఖర్ కుటుంబానికి గోటీల ఫ్యాక్టరీ ఉందని జరిగిన ప్రచారాన్ని గుర్తు చేస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సరికొత్త కంటెంట్ తో వచ్చిన 'బైకర్' మూవీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది. శర్వానంద్ పర్ఫార్మెన్స్, రాజశేఖర్ నటన, హై-వోల్టేజ్ రేసింగ్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంటూ, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv