Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram Charan: రాజకీయాల్లోకి రామ్ చరణ్.. సీఎం కావడంపై క్లారిటీ!

Ram Charan: రాజకీయాల్లోకి రామ్ చరణ్.. సీఎం కావడంపై క్లారిటీ!

10tv 4 days ago
  • రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్.
  • రాజకీయాలపై చరణ్ సంచలన వ్యాఖ్యలు.
  • సినిమాల్లో నెంబర్ వన్ లక్ష్యం.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'.

భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన వ్యక్తిగత నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలతో పాటు రాజకీయాల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట, సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ.. “మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి (CM) అవ్వాలనేది మీ అభిమానుల బలమైన కోరిక” అని అడిగారు. దీనికి రామ్ చరణ్ (Ram Charan)ఎంతో స్పష్టతతో సమాధానమిచ్చారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అస్సలు లేదని ఆయన తేల్చి చెప్పారు. సినిమా రంగంలోనే మరింత రాణించి, ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానాన్ని అందుకోవడమే తన ఏకైక లక్ష్యమని చరణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాజకీయాలు, సినిమాలు రెండు వేర్వేరు రంగాలని, తాను ఒకే సమయంలో రెండు పడవలపై ప్రయాణం చేయలేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేయడం చాలా కష్టమైన విషయమని పేర్కొన్నారు. గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని చరణ్ గుర్తుచేశారు. అభిమానులు కోరుకున్నప్పటికీ, తన పూర్తి దృష్టి కేవలం సినిమాలపైనే ఉంటుందని చెప్పడం ద్వారా పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్లకు ఆయన చెక్ పెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv