- త్రివిక్రమ్, చరణ్ కాంబో సెట్.
- సితార బ్యానర్ లో క్రేజీ మూవీ
- త్వరలోనే అధికారిక ప్రకటన
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ తన కెరీర్‌లో అత్యంత సాలిడ్ లైనప్ ను సెట్ చేస్తున్నారు.
ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమా రిజల్ట్ గురించి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాత ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్‌తో చరణ్ మరో మూవీ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సుకుమార్ మూవీ పట్టాలెక్కడానికి కొంత టైమ్ పట్టే అవకాశం ఉండటంతో, ఈ గ్యాప్‌లో చరణ్ ఒక సర్ప్రైజ్ ప్రాజెక్టు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. చరణ్ (Ram Charan)మాస్ ఇమేజ్‌కు, త్రివిక్రమ్ స్టైలిష్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రిజల్ట్ రావడం ఖాయం.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు సుకుమార్ తో యాక్షన్ డ్రామా, మరోవైపు త్రివిక్రమ్ తో క్లాసీ ఎంటర్టైనర్ ప్లాన్ చేయడం ద్వారా చరణ్ తన ఇమేజ్‌ను మరింత గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబోలు లైన్‌లో ఉండటంతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో దూసుకుపోవడం గ్యారెంటీ. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

