Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramchander Rao Arrest: భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. నల్గొండలో హైటెన్షన్

Ramchander Rao Arrest: భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. నల్గొండలో హైటెన్షన్

10tv 4 days ago
  • రామచందర్ రావు అరెస్ట్
  • నల్గొండలో చెలరేగిన దాడులు
  • ముదిరిన కాంగ్రెస్ భాజపా వివాదం

Ramchander Rao Arrest: తెలంగాణ రాజకీయాలు నల్గొండ జిల్లా వేదికగా తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు సిద్ధమైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు(Ramchander Rao Arrest)ను పోలీసులు ముందస్తు చర్యగా అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతుండగా, ప్రతిపక్ష గొంతు నొక్కడమేనని భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కోడిగుడ్ల దాడి – కాంగ్రెస్, భాజపా శ్రేణుల పరస్పర ఘర్షణలు:

నల్గొండ పట్టణంలో నిన్న కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై భాజపా శ్రేణులు కోడిగుడ్లతో దాడికి పాల్పడగా, దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భాజపా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగాయి. ఈ పరస్పర దాడులతో నల్గొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బాధితులకు పరామర్శకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు:

జిల్లా అధ్యక్షుడి ఇంట జరిగిన దాడి ఘటనను పరామర్శించి, బాధితులకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రామచందర్ రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, నిరంకుశంగా ప్రవర్తిస్తోందని భాజపా నేతలు మండిపడుతున్నారు. పరిస్థితులు చేయిదాటకుండా నల్గొండ వ్యాప్తంగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv