Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramcharan-Sukumar : హిట్ కాంబో.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.?

Ramcharan-Sukumar : హిట్ కాంబో.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.?

10tv 1 week ago

Ramcharan-Sukumar : రామ్‌చరణ్, సుకుమార్ కాంబో అంటేనే ఓ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్ కామన్‌. రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న ప్రచారంతో హైప్ పెరిగిపోతోంది.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్‌గా నిలిచింది.

కానీ పుష్ప-2 సమయంలో మైత్రి మూవీస్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో మైత్రి మూవీ మేకర్స్‌, దేవిశ్రీ మధ్య దూరం పెరిగిందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుక్కు, చరణ్‌ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది.
Shivani Nagaram : చీరకట్టులో అచ్చమైన పదహారు అణాల తెలుగింటి ఆడపిల్లలా.. శివానీ నాగారం క్యూట్ ఫోటోలు..

డైరెక్టర్‌ సుకుమార్ డైలమాలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఒక వైపు తనకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌తోనే కొనసాగాలా.? లేక మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకొని ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్నాడని టాక్. గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవిశ్రీని వదలను అన్నట్లుగా వార్తలు వచ్చినా, ఇప్పుడు సుక్కు సైలెన్స్‌తో కొత్త టాక్ మొదలైంది.

అటు మైత్రీ మూవీ మేకర్స్, ఇటు డీఎస్పీ ఎవరూ ఓ స్టెప్ దిగే పరిస్థితి లేదని.. వాళ్లిద్దరి మధ్య సుక్కు ఇబ్బంది పడుతన్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు సుక్కు, చరణ్ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు.? ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు.? చివరికి సుకుమార్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తాడో చూడాలి మరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv