Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rishabh Pant Fined : చెన్నై పై విజయం.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా..

Rishabh Pant Fined : చెన్నై పై విజయం.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా..

10tv 1 week ago
  • గెలుపు జోష్‌లో ఉన్న లక్నోకు షాక్‌
  • కెప్టెన్ రిషబ్ పంత్‌కు 12లక్షల ఫైన్‌
  • సీఎస్‌కేతో మ్యాచ్‌లో లక్నో స్లో ఓవర్ రేటు నమోదు చేయడమే కారణం

Rishabh Pant Fined : శుక్రవారం ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

గెలుపు జోష్‌లో ఉన్న లక్నో జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant)ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేటు (నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడం)ను నమోదు చేయడమే ఇందుకు కారణం.

ఈ సీజన్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడంతో కెప్టెన్ పంత్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. మరోసారి ఇదే తప్పిదానికి లక్నో జట్టు పాల్పడితే.. అప్పడు కెప్లెన్ పంత్‌కు 24లక్షలతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు.. రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది జరిమానాగా విధిస్తారు.

Rishabh Pant : గెలవడం చాలా బాగుంది.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్‌..

‘ఐపీఎల్ 2026లో భాగంగా 54వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా విధించాం. కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి ఉల్లంఘన ఇది కావడంతో, రిషబ్ పంత్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించాం.’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కార్తీక్ శర్మ (42 బంతుల్లో 71 పరుగులు),శివమ్ దూబె (16 బంతుల్లో 32 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మూడు, షమీ, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.

Ruturaj Gaikwad : లక్నోపై ఓటమి తరువాత చెన్నై ఆటగాళ్లకు రుతురాజ్ గైక్వాడ్ బిగ్‌ మెసేజ్‌..

ఆ తరువాత 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (38 బంతుల్లో 90 పరుగులు ), నికోలస్ పూరన్ (17 బంతుల్లో 32 నాటౌట్) రాణించారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ లు చెరో వికెట్ తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv