Dailyhunt
Sankatahara Chaturthi 2026 : మే 5 సంకటహర చతుర్థి.. ఏం చేయకపోయినా సరే.. 11 సార్లు ఈ మంత్రాన్ని చదివితే కష్టాలన్ని తొలగి అష్టైశ్వర్యాలు..!

Sankatahara Chaturthi 2026 : మే 5 సంకటహర చతుర్థి.. ఏం చేయకపోయినా సరే.. 11 సార్లు ఈ మంత్రాన్ని చదివితే కష్టాలన్ని తొలగి అష్టైశ్వర్యాలు..!

10tv 1 week ago

Sankatahara Chaturthi 2026 : ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు అనగా బహుళ పక్ష చవితి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. అయితే ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే..

దాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అలానే మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. మే 5, మంగళవారం నాడు సంకటహర చతుర్థి వస్తుంది. ఈరోజున వినాయకుడిని పూజిస్తే.. అప్పుల బాధలు, శత్రు పీడలు, వివాహ ఆలస్యం, సంతానం లేకపోవడం, పనుల్లో ఆటంకాలు వంటి సకల కష్టాలను (సంకష్టములను) తొలగిపోతాయని నమ్ముతారు.

  • చతుర్థి తిథి ప్రారంభం: మే 05, ఉదయం 5:24 గంటలకు
  • చతుర్థి తిథి ముగింపు: మే 06, ఉదయం 7:51 గంటల వరకు

చాలామంది తమ కోరికలు తీరడానికి, సమస్యలను దూరం చేయమని కోరుతూ సంకటహర చతుర్థి వ్రతం జరుపుకుంటారు. అయితే అలా పూజ చేయలేని వారు, వీలుపడగి వారు ఒక్క మంత్రాన్ని పఠిస్తే.. సంకటహర చతుర్థి వ్రతం చేసినంత ఫలితం వస్తుంది అంటున్నారు పండితులు. అదే ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 11 నుంచి 108 సార్లు చదవాలి.

గకారాది గణపతి అష్టోత్తరం:

సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికతో “గకారాది గణపతి అష్టోత్తరం” (ప్రతి నామం ‘గ’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 108 నామాలు) చదువుతూ పూజ చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది అంటున్నారు పండితులు.

గరిక ప్రాశస్త్యం:

గణపతికి గరిక (దూర్వ బిల్వం) తో పూజ చేయడం చాలా శ్రేష్ఠం. అందుకే సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు.. గరికను వీలైనంత వరకు మూలంతో (వేర్లతో) సహా తీసుకోవాలని చెబుతున్నారు. అయితే గడ్డికి గరికకు తేడా ఉంటుందని అది గమనించాలని చెబుతున్నారు.

పూజా విధానం:

  • కుడి వైపుకు తొండం ఉన్న గణపతి పటాన్ని ఎంచుకోవడం మంచిది
  • ఎర్రటి అక్షతలు (కుంకుమ కలిపినవి), ఎర్రటి పూలు (మందార, గులాబీ) పూజకు వాడాలి
  • నైవేద్యంగా 27 ఉండ్రాళ్ళు మరియు తప్పనిసరిగా బెల్లం ముక్క సమర్పించాలి
  • ముఖ్యంగా సాయంత్రం వేళ ప్రదోష కాలంలో చేసే పూజ గణపతికి అత్యంత ప్రీతికరం
  • ప్రత్యేక సంకల్పం మరియు పరిహారం:
  • పనులు త్వరగా పూర్తి కావాలనుకునే వారు ఒక ఎర్రటి వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయను మరియు 11 రూపాయలను కట్టి గణపతి దగ్గర ఉంచాలి
  • ఆ తర్వాత మీ మనోసంకల్పాన్ని చెప్పుకుని.. ఆరోజు నుంచి మళ్లీ వచ్చే నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి వరకు (సుమారు 30 రోజులు) ప్రతిరోజూ ఆ కొబ్బరికాయపై అక్షతలు వేస్తూ నమస్కరించుకోవాలి
  • 30 రోజుల తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి

ఫలితాలు:

  • ఈ విధంగా 30 రోజుల పాటు సంకల్పం చేసుకున్న కొబ్బరికాయకు పూజ చేయడం వల్ల కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయంటున్నారు పండితులు.
  • ముఖ్యంగా చర్మ రోగాలు, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ గకారాది అష్టోత్తర పూజ ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు పండితులు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వబడింది. దీనిని 10tv నిర్ధారించడం లేదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv