Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shankar: పాపం.. శంకర్ పై నమ్మకం లేదా.. విక్రమ్ 'వేల్పరి' కూడా క్యాన్సిల్

Shankar: పాపం.. శంకర్ పై నమ్మకం లేదా.. విక్రమ్ 'వేల్పరి' కూడా క్యాన్సిల్

10tv 4 months ago
  • స్టార్ డైరెక్టర్ శంకర్ బ్యాడ్ టైం
  • క్యాన్సిల్ అయిన భారీ వేల్పరి ప్రాజెక్ట్
  • త్వరలోనే కొత్త యాక్షన్ థ్రిల్లర్

Shankar: తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు తిరుగులేని సంచలనాలు సృష్టించిన స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కెరీర్ పరంగా తీవ్రమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.

‘రోబో’ చిత్రం తర్వాత ఆయనకు ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ లభించలేదు. ఇటీవల విడుదలైన ‘ఇండియన్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైంది. ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా డిజాస్టర్‌గా మిగలడంతో శంకర్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా మసకబారింది. ఎలాగైనా ఒక భారీ హిట్‌తో ఫామ్‌లోకి రావాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళ హీరో విక్రమ్‌తో కలిసి ‘వేల్పరి’ అనే ఒక భారీ పీరియాడిక్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌ను శంకర్ లైన్ లోకి తెచ్చారు. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు శంకర్‌ను నమ్మే పరిస్థితిలో లేరని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతటి భారీ బడ్జెట్ సినిమాను ఆయనకు అప్పగించడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తుండటంతో, ఇప్పుడు ఈ 'వేల్పరి' ప్రాజెక్ట్ దాదాపు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్‌కు ఇది తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం అయినప్పటికీ, ఏదీ కలిసిరాకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

వరుస ఎదురుదెబ్బలతో అలసిపోయిన శంకర్(Shankar), ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లకుండా రూట్ మార్చారు. తక్కువ సమయంలో, వేగంగా పూర్తి చేసేలా ఒక యాక్షన్ థ్రిల్లర్ కథను ఆయన సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన సత్తా చాటాలని శంకర్ పట్టుదలగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv