Dailyhunt
Shreyas Iyer : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?

10tv 3 weeks ago
  • శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు
  • వరుసగా రెండు సార్లు స్లో ఓవర్‌రేటును నమోదు చేసిన పంజాబ్ కింగ్స్‌
  • మూడోసారి కూడా ఇలాగే జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. బ్యాటర్‌గానే కాకుండా తనదైన వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మెడపై ఓ కత్తి వేలాడుతోంది. అదే గనుక జరిగితే ఐపీఎల్‌లో అతడి ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది

అసలేం జరిగిదంటే..?

శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఇలా స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇది రెండోసారి. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించారు. రూ.24 లక్షల ఫైన్ వేశారు. అంతేకాదండోయ్‌.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లు అందరి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదంటే రూ.6లక్షలు.. ఈ రెండింటిలో ఏదీ తక్కువ అయితే దాన్ని జరిమానాగా విధించారు.

Sanju Samson : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం.. సంజూ శాంసన్ పై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ హాట్ కామెంట్స్‌.. కాస్త ఓపిక..

మూడోసారి ఇలాగే జరిగితే..

ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి కూడా పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ పై ఓ మ్యాచ్ నిషేదాన్ని విధిస్తారు. అంతేకాకుండా అతడికి 30లక్షల ఫైన్ వేయడంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరి మ్యాచ్‌ల్లో ఫీజుల్లో 50 శాతం లేదంటే తలా 12 లక్షలు.. రెండింటిలో ఏదీ తక్కువైతే అది జరిమానాగా విధిస్తారు.

Shreyas Iyer : అందుకనే చాహల్‌కు పూర్తి ఓవర్ల కోటా ఇవ్వలేదు.. నాకు మైదానంలో డౌట్ వస్తే.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్

అంటే ఇక పై శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ అతడు ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనాల్సి వస్తే అది పంజాబ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv