Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shreyas Iyer : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20ల్లో ఏకైక భారత కెప్టెన్‌..

Shreyas Iyer : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20ల్లో ఏకైక భారత కెప్టెన్‌..

10tv 1 hr ago

Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 42 బంతుల్లో మూడు అంకెల స్కోరు సాధించాడు.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

ఇక ఓవరాల్‌గా టీ20ల్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా మూడు శతకాలు బాదగా, సూర్యకుమార్ యాదవ్ ఓ సెంచరీ చేశాడు. అంతేకాదండోయ్ వెస్టిండీస్ పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగానూ అయ్యర్ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (2018లో 111 నాటౌట్‌), కేఎల్ రాహుల్ (2016లో 110 నాటౌట్‌)లను అధిగమించాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ జట్టు 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో షై హోప్(52; 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో నమన్ దీర్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలా ఓ వికెట్ సాధించారు.

అనంతరం శ్రేయస్ అయ్యర్ (102 నాటౌట్; 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిగిలిన భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (37 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు), అభిషేక్ శర్మ (21; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సంజూ శాంసన్ (11; 9 బంతుల్లో 1 ఫోర్‌) విఫలం అయ్యాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv