Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shubman Gill : టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు బ్రేక్‌..

Shubman Gill : టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు బ్రేక్‌..

10tv 2 days ago
  • టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత
  • 6వేల పరుగుల మైలురాయి
  • ఈ ఘనత అత్యంత వేగంగా సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు

Shubman Gill : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.

టీ20ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తరువాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల) పరంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా, గిల్ 185వ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.

ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో గిల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 162 ఇన్నింగ్స్‌ల్లోనే టీ20ల్లో 6వేల పరుగుల క్లబ్‌ను చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో బాబర్ ఆజామ్‌, రాహుల్‌, షాన్ మార్ష్‌, కాన్వే, విరాట్ కోహ్లీలు ఉన్నారు.

Chennai Super Kings : ఐపీఎల్ నుంచి ఔట్‌.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జట్టు ఆటగాళ్లకు భారీ జరిమానా..

టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 6వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

* క్రిస్ గేల్ – 162 ఇన్నింగ్స్‌ల్లో
* బాబర్ ఆజామ్ – 165 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 166 ఇన్నింగ్స్‌ల్లో
* షాన్ మార్ష్ – 180 ఇన్నింగ్స్‌ల్లో
* డేవాన్ కాన్వే – 180 ఇన్నింగ్స్‌ల్లో
* విరాట్ కోహ్లీ – 184 ఇన్నింగ్స్‌ల్లో

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుభ్‌మన్ గిల్ (64; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు సాయి సుదర్శన్ (84; 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (57 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ లు తలా ఓ వికెట్ తీశారు.

Rohit Sharma : వన్డే ప్రపంచకప్ 2027 నుంచి రోహిత్ శర్మ ఔట్‌? హిట్‌మ్యాన్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ!

ఆ తరువాత 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. దీంతో గుజరాత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv