Sudheer Joker : సుడిగాలి సుధీర్ హీరోగా “సుధీర్ జోకర్” అనే కొత్త సినిమా రాబోతోంది. నేడు సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.
తమిళ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాణంలో పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నేడు సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా “సుధీర్ జోకర్” సినిమా గ్లింప్స్ ని బ్యాంగర్ పేరుతో సుధీర్ అభిమానుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించి రిలీజ్ చేసారు. మీరు కూడా సుధీర్ జోకర్ బ్యాంగర్ చూసేయండి..


