Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surekhavani : కూతురేమో అలా.. తల్లి ఏమో ఇలా.. కూతురు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సురేఖవాణి..

Surekhavani : కూతురేమో అలా.. తల్లి ఏమో ఇలా.. కూతురు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సురేఖవాణి..

10tv 1 week ago

Surekhavani : సీనియర్ నటి సురేఖావాణి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా రేర్ గా సినిమాలు చేస్తుంది.

సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సురేఖావాణి. ఇటీవలే ఆమె కూతురు సుప్రీత సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

చాలా రోజుల తర్వాత సురేఖ వాణి ఓ సినిమాలో నటిస్తుండటంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సురేఖావాణి రెండో పెళ్లిపై ఆమె కూతురు చేసిన కామెంట్స్ ని ప్రస్తావిస్తూ ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం చెప్పింది.

గతంలో సుప్రీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మకు పెళ్లి చేద్దాం అనే ఆలోచన ఉంది. రీసెంట్ గా కూడా పెళ్లి చేద్దాం అని మా అమ్మతో అన్నాను. కానీ తనకి నాన్నతోనే ఆగిపోవాలని ఉంది. ఆ ప్లేస్ లో ఎవరిని రానివ్వకూడదు అనుకుంటుంది. నేను పెళ్లి చేసుకునే ముందు అయినా మా అమ్మకు పెళ్లి చేయాలి. కానీ మంచి అబ్బాయి దొరకాలి, ఆమె ఓకే అనాలి, ఆమె హ్యాపీగా ఉండాలి. మా అమ్మను చాలా బాగా చూసుకోవాలి వచ్చే అతను అని తెలిపింది.

తాజాగా తన రెండోపెళ్లిపై సురేఖావాణి స్పందిస్తూ.. ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. నా కూతురికి పెళ్లీడు వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను. అయినా మీడియాలో గతంలోనే నాకు రెండో పెళ్లి అయిందని వార్తలు కూడా రాసేశారు కదా అని తెలిపింది. దీంతో కూతురుకి తన తల్లికి రెండో పెళ్లి చేయాలని ఉన్నా సురేఖవాణి ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv