Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Workers Wages: కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు

Telangana Workers Wages: కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు

10tv 3 days ago

Telangana Workers Wages: కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశంలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

కార్మికులను 3 జోన్లలో 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లలోని కార్మికులు ఉన్నారు. జోన్ లో మున్సిపాలిటీల్లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు ఉన్నారు. అన్ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 16వేల రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17వేల రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 18వేల 500 రూపాయలకు పెంచారు. హైస్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.20వేలకు పెంపు చేశారు. వేతనాల పెంపుతో కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ది కలగనుంది. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని వాపోయారు. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని.. ఆ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

* నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజన
* అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్‌ గా విభజన
* వర్క్ జోన్లను మూడు భాగాలుగా విభజన
* జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్లు
* జోన్-2లో మున్సిపాలిటీలు
* జోన్-3లో గ్రామీణ ప్రాంతాలు
* అన్‌స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు పెంపు
* సెమీ స్కిల్డ్ కేటగిరీలో రూ.13,152 నుంచి రూ.17 వేలకు పెంపు
* స్కిల్డ్ కేటగిరీలో రూ.13,772 నుంచి రూ.18,500కు పెంపు
* హై స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv