- చెన్నైతో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన టిమ్‌డేవిడ్
- 25 బంతుల్లో 70 పరుగుల అజేయ ఇన్నింగ్స్
- తృటిలో ప్రపంచ రికార్డు మిస్
Tim David : ఆదివారం చిన్నస్వామి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
25 బంతుల్లోనే 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
టిమ్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఒక్క పరుగు తేడాతో ప్రపంచ రికార్డు..
కాగా.. టిమ్ డేవిడ్ ఒక్క పరుగు తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో 15వ ఓవర్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు డానియల్స్ సామ్స్ పేరిట ఉంది. అతడు 2022లో ససెక్స్ పై 71 పరుగులు చేశాడు. తాజాగా టిమ్ డేవిడ్ 70 పరుగులు చేశాడు.
అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అవార్డు ను తీసుకున్న తరువాత అతడు మాట్లాడుతూ.. రజత్ పాటిదార్ పై ప్రశంసల వర్షం కురించాడు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలా ప్రతి రోజు జరగదు. ఇక కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అని డేవిడ్ అన్నాడు.
Ruturaj Gaikwad : తప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తారని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..
ఇక తాను వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం గురించి మాట్లాడుతూ.. తాను అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. తన ఆటను ఎక్కువగా మార్చకుండా ఆడేస్తున్నానని అన్నాడు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంది. సహచరులు, మేనేజ్‌మెంట్ నుంచి అద్భుతమైన మద్దతు ఉందన్నాడు.

