Dailyhunt
Trisha Krishnan : ట్రెండింగ్‌లో త్రిష.. పుట్టినరోజున తిరుమలలో పూజలు.. విజయ్ కోసమేనా? ఫొటోలు వైరల్!

Trisha Krishnan : ట్రెండింగ్‌లో త్రిష.. పుట్టినరోజున తిరుమలలో పూజలు.. విజయ్ కోసమేనా? ఫొటోలు వైరల్!

10tv 1 week ago
Trisha Krishnan : ట్రెండింగ్‌లో త్రిష.. పుట్టినరోజున తిరుమలలో పూజలు.. విజయ్ కోసమేనా? ఫొటోలు వైరల్! సినీనటి త్రిష కృష్ణన్ 43వ పుట్టినరోజు సందర్భంగా మే 4న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
 సోమవారం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో త్రిష తిరుమల దర్శనంపై అందరిలో ఆసక్తి నెలకొంది. బెస్ట్ ఫ్రెండ్ హీరో విజయ్ 'టీవీకే' పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేస్తోంది.
 ఈ నేపథ్యంలో త్రిష తిరుమల దర్శనానికి రావడం విజయ్ విజయం కోసమేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం త్రిష ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. త్రిష తిరుమల దర్శనం కేవలం పుట్టినరోజు సందర్భంగానా లేదా రాజకీయ కారణం కూడా ఉందా? అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.
 విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని, రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటూ త్రిష తిరుమల దర్శనం చేసుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv