Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trisha : విజయ్‌ని అడిగానని చెప్పండి అన్న అభిమాని.. త్రిష రియాక్షన్ వైరల్..

Trisha : విజయ్‌ని అడిగానని చెప్పండి అన్న అభిమాని.. త్రిష రియాక్షన్ వైరల్..

10tv 1 week ago

Trisha : విజయ్ - త్రిష రిలేషన్ గత కొన్నాళ్లుగా తమిళనాట వైరల్ అవుతూనే ఉంది. త్రిష విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

విజయ్ ఫ్యాన్స్ త్రిషని వదిన అని కూడా సంబోధిస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ త్రిషని పలకరించిన వీడియో వైరల్ గా మారింది.

సూర్య, త్రిష ముఖ్య పాత్రల్లో నటించిన కరుప్పు సినిమా నేడు రిలీజ్ అయింది. త్రిష ఈ సినిమాని చెన్నైలోని ఓ థియేటర్లో చూడటానికి వెళ్ళింది. త్రిష సినిమా చూసి బయటకు వస్తుంటే అభిమానులు ఆమె కారు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ విజయ్ అభిమాని ఆమె కార్ వద్దకు వచ్చి తలపతి విజయ్ ని అడిగానని చెప్పండి అని అన్నాడు. ఆ మాటలకు త్రిష ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

దీంతో విజయ్ పేరు ప్రస్తావన తీసుకురాగానే త్రిష సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్లిపోవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv