Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trump in China : చైనాలో ట్రంప్.. ఇండియాకి వచ్చే లాభమేంటి? నష్టమేంటి?

Trump in China : చైనాలో ట్రంప్.. ఇండియాకి వచ్చే లాభమేంటి? నష్టమేంటి?

10tv 1 week ago

Trump in China : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చైనా మీద విపరీతంగా ట్యాక్సులు పెంచిన ట్రంప్ ఇప్పుడు సడన్‌గా జిన్ పింగ్‌తో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ విమానంలో తనతోపాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్, లారీ ఫింక్ లాంటి దిగ్గజ వ్యాపార అధినేతలను కూడా తీసుకెళ్లారు. అయితే అమెరికా, చైనా దోస్తీతో ఇండియాకు వచ్చే లాభనష్టాలు ఏంటో చూద్దాం.

ట్రంప్ చైనా టూర్‌లో ముఖ్యమైన అంశాలు ఐదు అంశాలు ఉన్నాయి. అవేంటంటే..
1. అమెరికా – చైనా ట్రేడ్ వివాదం
2. తైవాన్ వివాదం
3. ఇరాన్‍కు చైనా పరోక్ష సహకారం అందిస్తుందనే వివాదం
4. ఏఐ, సెమీకండక్టర్ తయారీ కాంపిటీషన్
5. గ్లోబల్ ఆయిల్ సప్లై ని సమతుల్యం చేయడం

ఇప్పుడు ఒక్కో అంశాన్ని పరిశీలిస్తే ట్రంప్ చైనాలో జిన్ పింగ్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వగానే అన్నీ పరిష్కారం అయిపోవు. కేవలం కొద్దిసేపు బ్రేక్ మాత్రమే పడుతుంది. ఇక్కడ రెండు దేశాలకు ఉపయోగపడే అంశం ఏంటంటే.. ఎంత ఔననుకున్నా కాదనుకున్నా.. పరస్పరం రెండు దేశాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు అక్కడ ద్రవ్యోల్బణం, రేట్ల పెరుగుదలను కంట్రోల్ చేయడానికి ట్రంప్ చేస్తున్న ఒక ప్రయత్నం. అదే సమయంలో చైనా గతంలో దూసుకెళ్తున్నంత వేగంగా ఆర్థిక వృద్ధి లేదు. కొంత మందగమనంలో ఉంది. కాబట్టి చైనాకు కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ అవసరం. కాబట్టి ఇద్దరికీ లాభదాయకమే.

ఇరాన్ క్రూడాయిల్‌తో పాటు వ్యాపార అవకాశాల మీద ట్రంప్ ఎక్కువ దృష్టి పెట్టారు. ఇరాన్ ఆయిల్ అత్యధికంగాకొనే దేశాల్లో చైనా మొదటిది. జియో పొలిటికల్ వివాదాలు ఎలా ఉన్నా.. ఆర్థికంగా ఇద్దరికీ సమస్య రావొద్దనేది అటు ట్రంప్, ఇటు జిన్ పింగ్ ఇద్దరూ ఆలోచిస్తున్న అంశం. టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యం తగ్గకూడదన్నది ట్రంప్ అభిప్రాయం. సెమీకండక్టర్ల తయారీలో చైనా పవర్ తగ్గకూడదని జిన్ పింగ్ అభిప్రాయం.

ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుంది?
ఒకవేళ చైనాకు ప్రత్యామ్నాయంగా మరో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియాను అమెరికా ఎంచుకుంటే మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ, సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్, మొబైల్స్ తయారీ, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలు.

ఇండియాని దెబ్బకొట్టే అంశాలు ఏంటి?
చైనా ఇరాన్‌ను పరోక్షంగా సపోర్ట్ చేసుకుంటూ పోతే.. పశ్చిమాసియాలో ఈ అనిశ్చితి కొనసాగితే ఇండియాకు నష్టం. ముఖ్యంగా ఆయిల్ ధరల రూపంలో భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆయిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఒకవేళ చైనా, అమెరికా ఫ్రెండ్ షిప్ బలోపేతం అయితే ఆసియాలో డ్రాగన్ ప్రభావం మరింత పెరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మీద ఆల్రెడీ చైనా కన్ను ఉంది. హిందూ మహాసముద్రం మీద తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవులకు రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందించి తమ వైపు తిప్పుకొంటే అప్పుడు ఇండియాకు నష్టమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv