Dailyhunt
TVK Vijay : తమిళనాట విజయ్ వీరవిహారం.. 49ఏళ్ల రికార్డు బద్దలు కాబోతుందా? అదే జరిగితే..

TVK Vijay : తమిళనాట విజయ్ వీరవిహారం.. 49ఏళ్ల రికార్డు బద్దలు కాబోతుందా? అదే జరిగితే..

10tv 1 week ago

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఒంటరిగా ఢీకొట్టిన విజయ్ టీవీకే పార్టీ .. ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

తమిళనాట మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తమిళనాడులో అధికారం చేపట్టడానికి 118 సీట్లు కావాల్సి ఉంటుంది. మేజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఉన్న టీవీకే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటై, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపడితే తమిళనాడులో 49ఏళ్ల రికార్డును బద్దలవుతుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ దూకుడుతో తళపతి విజయ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గత 49ఏళ్లుగా తమిళనాడులో ఏ సినీనటుడికి సాధ్యంకాని ఘనతను ఆయన సొంతం చేసుకుంటారు. సీఎంగా బాధ్యతలు చేపడితే 1977లో ఎం.జీ. రామచంద్రన్ తరువాత పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లోనే తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన సినీ నటుడిగా విజయ్ 49ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనున్నారు.

ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్థాపించిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) 1972లో డీఎంకే (DMK) నుండి విడిపోయిన తరువాత ఆయన ఈ పార్టీని స్థాపించారు. అయితే, ఎంజీఆర్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభంలోనే 1977లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి గత 49 సంవత్సరాలలో ఏ కొత్త నాయకుడు కూడా ఎన్నికల తొలి ప్రయత్నంలోనే ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయలేదు. తాజాగా. విజయ్ తన మొదటి ప్రయత్నంలో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 49ఏళ్ల క్రితం ఎంజీఆర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టినట్లవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv