Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Unified Welfare Card: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ 'ఆల్ ఇన్ వన్' కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్

Unified Welfare Card: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ 'ఆల్ ఇన్ వన్' కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్

10tv 2 weeks ago

Unified Welfare Card: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ ఇవ్వనుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా 'సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ది చేకూరుతుందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ దీనిపై ప్రత్యేకంగా చర్చించారు.

సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరతాయన్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్‌ ఇచ్చేలా ఆలోచన చేయాలని సీఎం రేవంత్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv