Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Varun Sandesh : 'బ్లాక్ మెయిల్' చేస్తానంటున్న వరుణ్ సందేశ్.. కొత్త సినిమా ఓపెనింగ్..

Varun Sandesh : 'బ్లాక్ మెయిల్' చేస్తానంటున్న వరుణ్ సందేశ్.. కొత్త సినిమా ఓపెనింగ్..

10tv 1 week ago

Varun Sandesh : వరుణ్ సందేశ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు. వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాణంలో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ మెయిల్ అనే కొత్త సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ సినిమాలో జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్.. పలువురు కీలకపాత్రలు పోషించనున్నారు. ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట క్లాప్ కొట్టగా నిర్మాత భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా జెమిని సురేష్ గారి తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి మొదటి షాట్ దర్శకత్వం వహించారు.

సినిమా లాంచ్ అనంతరం వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ చాలా కాలంగా తెలుసు. ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది అని అన్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ.. మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.

నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నాను. నేను హీరోగా తొలి చిత్రం దర్శకత్వం చేసిన శ్రీనివాస్ ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది అని అన్నారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv