Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
VB-G RAM G Wages : ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్.. ఈనెల 10 తరువాత బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు..

VB-G RAM G Wages : ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్.. ఈనెల 10 తరువాత బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు..

10tv 1 week ago
  • ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ఈనెల 10 తర్వాత వారి అకౌంట్లలోకి డబ్బులు
  • వీబీ జీరామ్‌జీ పథకం కింద ఏపీకి భారీగా నిధులు

VB-G RAM G Wages: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్ జీ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉపాధి హామీ పథకం కింద ఏపీ వ్యాప్తంగా జూన్ నెలలో 14లక్షల నుంచి 20లక్షల మంది పనులు చేసినట్లు సమాచారం. అయితే, ఆ పథకం స్థానంలో వీబీజీ రామ్ జీ పథకం అమల్లోకి రావడంతో జూన్ నెలకు సంబంధించిన వేతనాలపై కొందరిలో ఆందోళ నెలకొంది. ఈ క్రమంలో వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 10వ తేదీ తరువాత ఆ నిధులు సంబంధిత కూలీల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

మరోవైపు.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ పథకం (VB-G RAM G) అమలుకు కేంద్రం ఈ నిధులు ఇచ్చింది. దాదాపు రూ.1,414.16 కోట్లు విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకే అధిక నిధులు ఇవ్వండం విశేషం. ఏపీలో శ్రామికుల వేతనాల చెల్లింపునకు ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరుకు తొలి విడతగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వినిగించనున్నారు.

కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఎస్సీ వర్గాలకు రూ.241.54కోట్లు, ఎస్టీలకు రూ.78.21 కోట్లు, ఇతర వర్గాలకు రూ.1094కోట్లు కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన రూ.1,414.16 కోట్లతోపాటు ఏపీవాటా కింద మరో రూ.565.66 కోట్లు (40శాతం నిధులు) కలిపి శ్రామికులకు చెల్లిస్తారు. పనులకు సంబంధించి అన్ని వ్యయాలు వీబీజీరామ్‌జీ సాఫ్ట్‌వేర్‌, పీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు కావాలని, శ్రామికులకు ఎలాంటి డబుల్‌ చెల్లింపులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తేనే శ్రామికుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv