Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veta : చిరంజీవి సినిమా టైటిల్‌తో.. ఈటీవీ విన్ కొత్త సినిమా ఓపెనింగ్..

Veta : చిరంజీవి సినిమా టైటిల్‌తో.. ఈటీవీ విన్ కొత్త సినిమా ఓపెనింగ్..

10tv 2 weeks ago

Veta : ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్త నిర్మాణంలో నేడు కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి సినిమా 'వేట' టైటిల్ ప్రకటించారు.

సందీప్ సరోజ్, సాత్విక జంటగా కేఎస్ రవికుమార్ కీలక పాత్రలో ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్.. పలువురు గెస్ట్ లుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమం అనంతరం హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. కమిటీ కుర్రోళ్లు సినిమాతో అందరికీ పరిచయం అయ్యాను. వేట అనేది చిరంజీవి గారి టైటిల్. మా కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని పెట్టమని తెలిపారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అశోక్ వేట కథని నాకు కాల్‌లో వివరించారు. కథ అద్బుతంగా అనిపించింది. మా ఆవిడ కూడా కథ విని ఈ సినిమా చేయమని చెప్పింది. ఈ సినిమాలో నాది పెద రాయుడు టైపు పాత్ర. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అన్నారు.

దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ.. వేట సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు ధన్యవాదాలు అని తెలిపారు. నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. కమిటీ కుర్రోళ్లు సినిమాలనే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv