Dailyhunt
Vijay affidavits : 'దొరికిపోయిన విజయ్..' తేడాలు బయటపడ్డాయ్.. ఇదిగో సాక్ష్యాలు..

Vijay affidavits : 'దొరికిపోయిన విజయ్..' తేడాలు బయటపడ్డాయ్.. ఇదిగో సాక్ష్యాలు..

10tv 3 weeks ago
  • ఎన్నికల ముందు విజయ్ కు షాక్
  • అఫిడవిట్లలో సమర్పించిన వివరాల్లో తేడాలు
  • చట్టపరంగానే కాక రాజకీయంగా ఇబ్బందులంటున్న నిపుణులు

Vijay affidavits : నటుడు, టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఆయన పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ సమర్పించిన రెండు వేర్వేరు ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిసింది. ఇది విజయ్‌కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇది చట్టపరమైన, రాజకీయ వివాదాలకు దారితీయవచ్చు.

పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో సమర్పించిన ఈ అఫిడవిట్లలో.. తనపై నమోదైన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల విషయంలో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్ మార్చి 30న, చెన్నైలో నోటరైజ్ చేసిన పెరంబూర్ అఫిడవిట్‌లో.. తనపై ఎలాంటి పెండింగ్ క్రిమినల్ కేసులు లేవని వెల్లడించారు. అయితే మూడు రోజుల తర్వాత తిరుచిరాపల్లిలో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం తనపై రెండు ఎఫ్ఐఆర్ (FIRs)లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఒక కేసు మదురై జిల్లా కూదాకోవిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైందని.. మరొకటి చెన్నైలోని పెరవల్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైనట్లుగా వెల్లడించారు.

కేసుల విషయంతో పాటు ఎన్నికల ఖర్చులకు సంబంధించి అఫిడవిట్‌లో వెల్లడించిన ఆర్థిక వివరాల్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెరంబూర్ అఫిడవిట్‌లో, ఎన్నికల ఖర్చుల కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సలిగ్రామం బ్రాంచ్‌లో ఒకే ఖాతా ఉందని, అందులో రూ.1 లక్ష డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ తిరుచిరాపల్లి అఫిడవిట్‌లో, రెండు ఖాతాలను చూపించారు. పెరంబూర్ కోసం సలిగ్రామం ఖాతాను కొనసాగిస్తూ, అదనంగా తిరుచిరాపల్లి మెయిన్ బ్రాంచ్‌లో మరో ఖాతా ఉందని, అందులో రూ.90,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎన్నికల అఫిడవిట్‌లో నిజాలను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం వాటిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇందుకు గాను ఆరు నెలల వరకు జైలుశిక్ష, జరిమానా లేదంటే కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. ఇది విజయ్‌కి రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బందులు తీసుకొస్తుందంటున్నారు. అయితే టీవీకే పార్టీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv