Dailyhunt
Vijay-Trisha Political Entry : తమిళ రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ.. ఏకంగా డిప్యూటీ CM..?

Vijay-Trisha Political Entry : తమిళ రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ.. ఏకంగా డిప్యూటీ CM..?

10tv 2 weeks ago

TVK Vijay – Trisha : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం పార్టీ దూసుకుపోతోంది. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు.

అలానే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. తమిళనాడు ఫలితాలు ప్రారంభమైన సమయం నుంచి నటి త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా నేడు త్రిష పుట్టినరోజు. పుట్టిన రోజు సందర్భంగా త్రిష నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ పార్టీ ముందంజలో ఉందని తెలిసిన వెంటనే త్రిష ఆయన నివాసానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర ప్రచారం సాగుతోంది.

విజయ్ పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే త్వరలోనే ఆయన ఏదో ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విజయ్ రాజీనామా చేసిన నియోజకవర్గంలో త్రిష పోటీ చేస్తుందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమెకి మంత్రి పదవి కూడా ఇస్తారని.. లేదంటే డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం.. విజయ్ రాజీనామా చేసిన స్థానంలో ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ పోటీ చేస్తారని అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకున్నారు. విజయ్-త్రిషల మధ్య ఉన్న బంధం వల్లే సంగీత ఇలాంటి విడాకులు తీసుకుందని జోరుగా ప్రచారం సాగింది. డీఎంకే, బీజేపీ నేతలు దీన్ని అడ్డు పెట్టుకుని.. త్రిష, విజయ్‌ల మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్.. విజయ్, త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా.. ఓటర్లు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటున్నారు. గతంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv