- గత కొంతకాలంగా లండన్‌లో ఎక్కువగా ఉంటున్న కోహ్లీ
- సరదాగా ట్రోల్ చేసిన మిస్టర్ నాగ్స్
- నలుగురు కాదు ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆర్‌సీబీ ఆడిస్తోందని
Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. ఇక తమ రెండో మ్యాచ్‌ను ఆర్‌సీబీ ఆదివారం (ఏప్రిల్ 5న) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌కు, రెండో మ్యాచ్‌కు మధ్య కాస్త విరామం దొరకడంతో ఆర్‌సీబీ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. కాగా.. తాజాగా ఆర్‌సీబీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఫ్రాంచైజీ ఎంటర్ టైనర్ నాగ్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli )ని సరదాగా ట్రోల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ లండన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ మ్యాచ్‌లు లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి అక్కడ సరదాగా ఉంటున్నాడు. ఇక తాను క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత లండన్‌లోనే స్థిరపడతానని ఇప్పటికే కోహ్లీ చెప్పాడు.
దీనిని ఉద్దేశించి నాగ్స్ సరదాగా కోహ్లీని ట్రోల్స్ చేశాడు. ఆర్‌సీబీ జట్టు ఐదుగురు విదేశీ ఆటగాళ్లను బరిలోకి దించుతోందని అన్నాడు. నిబంధనల ప్రకారం నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో ఉండాలని కానీ ఆర్‌సీబీ ఐపీఎల్ నిబంధనలను ఉల్లఘించిందని ఫ్యాన్స్ నమ్ముతున్నారని అన్నాడు.
'సోషల్ మీడియాలో మీ గురించి జనాలు చాలా విషయాలు చెబుతుంటారు. ఆర్‌సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడిస్తోందని జనాలు అంటున్నారు. అసలు వాళ్లు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు.' అని నాగ్స్ అన్నాడు. వెంటనే కోహ్లీ నవ్వేశాడు. 'నాకు తెలియదు, నన్నెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? విదేశీ ఆటగాళ్లను అడగండి? నేను విదేశీ ఆటగాడిని కాదు.' అని కోహ్లీ సమాధానం ఇచ్చాడు.
Shreyas Iyer : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?
ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు.

