Dailyhunt
Vivo Y19s 5G Price : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ వివో Y19s 5G చాలా చీప్ గురూ.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Vivo Y19s 5G Price : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ వివో Y19s 5G చాలా చీప్ గురూ.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

10tv 2 weeks ago
  • అత్యంత సరసమైన ధరకే వివో Y19 5జీ ఫోన్
  • 6000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌
  • అసలు ధర రూ. 14,999 నుంచి 17శాతం తగ్గింపుతో రూ.
  • 12,499కే

Vivo Y19s 5G Price : వివో ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. 2026లో ఎంట్రీ-లెవల్ 5జీ ఫోన్ వివో Y19s 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్.

ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. కొనాలని అనుకుంటే ఈ వివో Y19s 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివో Y19s 5జీపై డిస్కౌంట్ :
వివో Y19s 5జీ ఫోన్ రూ. 14,999కు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు 17శాతం తగ్గింపుతో రూ. 12,499కే అందుబాటులో ఉంది. సరసమైన ధరలో 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. మీరు ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు.

అద్భుతమైన డిస్‌ప్లే :
ఈ ఫోన్‌లో 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ వీడియో ప్లేబ్యాక్, బ్రౌజింగ్, సోషల్ మీడియా వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీతో వస్తుంది. వినియోగదారులు ఎక్కువ సేపు కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

పర్ఫార్మెన్స్, స్టోరేజీ :
ఈ వివో ఫోన్ కాలింగ్, బ్రౌజింగ్, అప్లికేషన్ల కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ అందిస్తుంది. ఈ సిస్టమ్‌లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. తగినంత స్టోరేజీతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 2TB వరకు విస్తరించవచ్చు. ఈ వివో ఫోన్ గేమింగ్‌కు పెద్దగా సపోర్టు ఇవ్వదు.

కెమెరా ఫీచర్లు :
వివో Y19s 5జీలో 13MP మెయిన్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ ఫొటోగ్రఫీ, వీడియో కాల్స్ చేయొచ్చు. ఈ కెమెరా డే టైమ్‌లో కూడా అద్భుతంగా ఉంటుంది.

లాంగ్ బ్యాటరీ లైఫ్ :
ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసతే ఒక రోజు కన్నా ఎక్కువ పవర్‌ అందిస్తుంది. ఈ ఫోన్ అద్భుతమైన బ్యాటరీతో వస్తుంది. ఎలాంటి గ్యాప్ లేకుండా వీడియోలు చూడొచ్చు లేదా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు. ఈ వివో ఫోన్ 15W ఛార్జింగ్‌ అందిస్తుంది.

ఇంతకీ కొనాలా? వద్దా? :
వివో Y19s 5జీ ఫోన్ లాంగ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్, సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కాల్స్ ఒక్కటే కాదు.. సోషల్ మీడియా పోస్టింగ్ వంటి ఇతర పనులకు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు అనమాట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv