Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Watpally Police Station: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. చెట్టుకు యువకుడి శవం.. గ్రామస్తుల ఆగ్రహం, పీఎస్‌పై దాడి

Watpally Police Station: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. చెట్టుకు యువకుడి శవం.. గ్రామస్తుల ఆగ్రహం, పీఎస్‌పై దాడి

10tv 2 weeks ago
  • యువకుడి అనుమానాస్పద మరణం దాడి
  • పోలీస్ స్టేషన్‌పై తీవ్ర విధ్వంసం
  • న్యాయం కోసం బంధువుల ఆందోళన

Watpally Police Station: సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్థానిక ఒక దాబాలో పనిచేస్తున్న బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీస ముందస్తు వివరాలు తెలపకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందికి దించడంపై మృతుని స్వగ్రామమైన దరఖాస్తుపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

Commercial Taxes Department: తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.7,865 కోట్ల రాబడి

పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడ్డ బంధువులు:

పోలీసులు దాబా యజమానితో కుమ్మక్కై ఆధారాలు తుడిచేసేందుకు యత్నిస్తున్నారంటూ దరఖాస్తుపల్లికి చెందిన ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌(Watpally Police Station)కు చేరుకున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన క్రమంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు స్టేషన్‌పైకి విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో పోలీస్ స్టేషన్‌లోని కిటికీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.

నిరసనతో అలుముకున్న ఆందోళన వాతావరణం:

యువకుడి అనుమానాస్పద మృతిపై స్పష్టమైన సమాధానం చెప్పకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదంటూ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఆందోళనను కొనసాగించడంతో అక్కడ తీవ్ర ఆందోళనకర పరిస్థితులు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv