Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Xiaomi 17 Ultra Price : వారెవ్వా.. అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ షావోమీ అల్ట్రా ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంట్..!

Xiaomi 17 Ultra Price : వారెవ్వా.. అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ షావోమీ అల్ట్రా ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంట్..!

10tv 6 days ago
  • షావోమీ 17 అల్ట్రా అధికారిక ధర రూ. 1,39,999
  • అమెజాన్‌లో ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 10వేలు తగ్గింపు
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత ఆదా

Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్. ఇందులో ప్రీమియం హార్డ్‌వేర్, హై-ఎండ్ కెమెరా ఉంది.

ధర పరంగా చాలా ఖరీదైనది అయినా ప్రస్తుతం అమెజాన్ అదిరిపోయే డీల్‌ అందిస్తోంది. తద్వారా అసలు ధర రూ. 10వేల వరకు తగ్గుతుంది. షావోమీ 17 అల్ట్రా కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

షావోమీ 17 అల్ట్రా డీల్ :
షావోమీ 17 అల్ట్రా ఫోన్ అధికారిక ధర రూ. 1,39,999 మాత్రమే. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కొంటే ఎస్బీఐ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో ఈఎంఐ రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. అదనపు తగ్గింపు కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

షావోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
షావోమీ 17 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ షావోమీ ఫోన్ 6,000mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. షావోమీ 17 అల్ట్రా బ్యాక్ సైడ్ లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 200MP టెలిఫోటో సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.

కొనాలా? వద్దా? :
కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. కొనుగోలుదారులకు షావోమీ 17 అల్ట్రా అద్భుతమైన ఆప్షన్. ఫొటోగ్రఫీతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ప్యాకేజీని అందిస్తుంది. ఇందులో అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా షావోమీ 17 అల్ట్రా అద్భుతంగా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv