- ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న యశస్వి జైస్వాల్
- ఆర్ఆర్ తరుపున 100 సిక్సర్లు కొట్టిన నాలుగో ప్లేయర్‌గా ఘనత
Yashasvi Jaiswal : రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో వంద సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. మంగళవారం గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన జైస్వాల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 32 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు.
2020లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు యశస్వి జైస్వాల్. అతడు ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడాడు. 36.5 సగటుతో 2336 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, 17 అర్థశతకాలు ఉన్నాయి.
బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టిన బుడ్డోడు.. తొలి బంతికే సిక్స్.. పేస్ గుర్రం రియాక్షన్ వైరల్
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ తరుపున వంద సిక్సర్లు కొట్టిన నాలుగో ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డులకు ఎక్కాడు. సంజూ శాంసన్, జోస్ బట్లర్, షేన్ వాట్సన్‌లు యశస్వి కన్నా ముందు ఈ ఘనత సాధించారు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* సంజూ శాంసన్ – 192 సిక్సర్లు
* జోస్ బట్లర్ – 135 సిక్సర్లు
* షేన్ వాట్సన్ – 109 సిక్సర్లు
* యశస్వి జైస్వాల్ – 100 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.
అదే మా కొంప ముంచింది.. బ్యాటర్ల తప్పేం లేదు.. హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు..
ఆ తరువాత 151 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 11 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో నమన్ ధీర్ (25), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (25), తిలక్ వర్మ (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. ఆర్ఆర్ బౌలర్లలో నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే లు చెరో వికెట్ తీశారు.

