Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనూహ్య విజయం: స్టాలిన్‌పై మాజీ అనుచరుడు వి.ఎస్. బాబు విజయం

అనూహ్య విజయం: స్టాలిన్‌పై మాజీ అనుచరుడు వి.ఎస్. బాబు విజయం

మిళనాట ప్రకంపనలు సృష్టిస్తోన్న ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి (డీఎంకే) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె.

స్టాలిన్‌ను పోటీచేశారు. అయితే తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థి వి.ఎస్. బాబు ఆయనను ఓడించారు.

21 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం, వి.ఎస్. బాబు 82,180 ఓట్లు సాధించి, స్టాలిన్ పొందిన 72,988 ఓట్ల కంటే ముందంజలో ఉన్నారు. బాబు 9,192 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఏఐఏడీఎంకే అభ్యర్థి 18,182 ఓట్లతో వెనుకబడి పోయారు. నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే) 4,974 ఓట్లు దక్కించుకుంది.

ఒకప్పుడు స్టాలిన్ శిష్యుడు..

వి.ఎస్. బాబు ఒకప్పుడు ఎం.కె. స్టాలిన్‌కు సన్నిహితుడు. ఆయన స్టాలిన్ ఎన్నికల ఏజెంట్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత డీఎంకే జిల్లా కార్యదర్శి అయ్యారు. అయితే, పార్టీ నుంచి తొలగించిన తర్వాత బాబు రాజకీయ ప్రస్థానం మలుపులు తిరిగింది. మొదట ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)లో చేరి, చివరకు నటుడు-రాజకీయవేత్త అయిన విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) తరుపున టికెట్ పొందారు.

కంచుకోట బద్దలు..

ఒకప్పుడు సేవ చేసిన నాయకుడినే బాబు ఓడించి తమిళనాట సంచలనం సృష్టించారు. ఈ ఫలితం డీఎంకే అధినేత కంచుకోట ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, సాంప్రదాయ ద్రావిడ ప్రధాన పార్టీలపై ప్రజల్లో నిరాశను, మరోవైపు టీవీకేకు పెరుగుతున్న ఆదరణకు సంకేతమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

గతంలోనూ..

కొలత్తూరు ఫలితం మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఒక చారిత్రాత్మక ఎన్నికల ఫలితాన్ని గుర్తుచేస్తోంది. 1996 అసెంబ్లీ ఎన్నికలలో, ఏఐఏడీఎంకే అధినేత్రి జె. జయలలిత బర్గుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన మొదటి ఘోర పరాజయాన్ని చవిచూశారు. డీఎంకే అభ్యర్థి సుకవనం ఆమెను 8,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు. ఇది ఏఐఏడీఎంకే కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సంవత్సరం పార్టీ ఘోర పరాజయం పాలైంది.

జయలలిత ఓటమిలాగే, కోలత్తూరులో స్టాలిన్ ఓటమి కూడా ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయే అవకాశం ఉంది. 8వ తరగతి వరకు చదువుకున్న బాబు 2006లో పురసవాకం (Purasawalkam) డీఎంకే నుంచి పోటీ చేసి గెలిచారు. 2006 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh