Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చలేదా?: జగన్

బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చలేదా?: జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు అనే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైఎస్సార్‌సీపీపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ, గన్ కల్చర్ ఎవరిదో చరిత్రను తిరగేస్తే తెలుస్తుందని, తమపై బురద జల్లడం మానుకోవాలని ఆయన చంద్రబాబు ముఠాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

హత్యా రాజకీయాలకు మేమే బాధితులంతమ కుటుంబం హత్యా రాజకీయాలను ప్రోత్సహించేది కాదని, తామే దానికి ప్రత్యక్ష బాధితులమని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రల వల్ల తన తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, బాబాయి వివేకానంద రెడ్డిలను కోల్పోయామని గుర్తుచేశారు. 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తన తాత రాజారెడ్డి హత్య జరిగిందని, ఆ కేసులోని దోషులను టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాచి రక్షించారని ఆరోపించారు. అలాగే అసెంబ్లీలో వైఎస్సార్‌ను భయపెట్టేలా మాట్లాడిన నాలుగు రోజులకే ఆయన ప్రమాదంలో మరణించారని, వివేకా కేసులో హంతకుడైన దస్తగిరిని చంద్రబాబు తన లాయర్ లూథ్రా సహాయంతో దర్జాగా తిప్పుతున్నారని, ఇందులో ఎవరిది క్రిమినల్ మైండ్ అని జగన్ ప్రశ్నించారు.గన్ కల్చర్, శవ రాజకీయాలు ఎవరివి?టీడీపీ నేతల చరిత్రలోనే గన్ కల్చర్ ఉందంటూ చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన పాత కాల్పుల ఉదంతాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్‌మెన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని గుర్తుచేశారు. ఇక శవ రాజకీయాల విషయానికొస్తే, హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు పరామర్శకు వెళ్లి, అక్కడ కేటీఆర్‌తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. సొంత మామ, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్న చంద్రబాబువి కుట్ర రాజకీయాలు కావాలా అని నిలదీశారు.చరిత్రలో వెన్నుపోట్లు, హత్యలువిజయవాడలో పేదల కోసం నిరాహార దీక్ష చేస్తున్న టైగర్ వంగవీటి మోహన రంగాను అర్థరాత్రి దారుణంగా నరికి చంపిన ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయని జగన్ ఆరోపించారు. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు నేడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేశారు. అలాగే ఎన్టీఆర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మల్లెల బాబ్జీ లాడ్జీలో శవంగా మారడం, టీడీపీ అవినీతిని ప్రశ్నించిన జర్నలిస్ట్ పింగళి దశరథ్‌రామ్‌ను కత్తులతో పొడిచి చంపడం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. ధర్నాల సమయంలో బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు కేడర్‌కు చెప్పేవారంటూ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాలను, ఇచ్చిన ఇంటర్వ్యూలను జగన్ ఉదహరించారు.చంద్రబాబుకు వయసు గుర్తుచేసిన జగన్తాము ఎల్లప్పుడూ విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జగన్ మంచివాడు, శాంతికాముకుడు కాబట్టే మా తాతను చంపిన వాళ్లు కూడా నేడు పులివెందులలో ప్రశాంతంగా తిరుగుతున్నారు. నేను చెడ్డవాడిని అయితే వాళ్లు అలా ఉండగలిగేవారా? అని తన మనస్తత్వాన్ని వివరించారు. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవడమే తన తండ్రి తనకు నేర్పిన పాఠమన్నారు. చివరగా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. నీకు 77 సంవత్సరాలు వచ్చాయి, బహుశా ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు, ఇంకా ఈ వయసులో ఇలాంటి చిల్లర, అబద్ధపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ జగన్ ఘాటుగా ప్రశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh