Dailyhunt
ఇదేం ఘోరం రా అయ్యా! అన్నం ఎక్కువ తింటే భార్యను చంపేస్తావా?

ఇదేం ఘోరం రా అయ్యా! అన్నం ఎక్కువ తింటే భార్యను చంపేస్తావా?

ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన పద్మజ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య అధిక బరువుతో ఉండటం, ఎక్కువ ఆహారం తీసుకుంటోందనే కారణంతోనే భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసు విచారణలో తేలింది.

ఈ కిరాతక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొద్దుటూరుకు చెందిన పద్మజ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త కిరణ్‌కుమార్ కూడా ఆమెది సహజమరణమేనని నమ్మించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ హత్య పూర్తిగా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు స్పష్టమైంది.

హత్యకు దారితీసిన కారణాలు..పద్మజ లావుగా ఉండటం, ఆమె ఎక్కువ అన్నం తింటోందని కిరణ్‌కుమార్ అసహ్యించుకునేవాడు. భార్య తనను నిత్యం అనుమానిస్తోందనే కోపంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి అతనికి ఓ యువతితో అక్రమ సంబంధం కూడా ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది. హత్య ఎలా చేయాలో తెలుసుకునేందుకు కిరణ్‌కుమార్ యూట్యూబ్‌లో శోధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. ఇందుకోసం సుమారు 80 వేలు ఖర్చు చేశాడు.భార్యకు ఇష్టమైన పాలకోవలో విషం కలిపి ఆమెకు తినిపించాడు. పాలకోవ తిన్న కాసేపటికే పద్మజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ మనసు కరగని భర్త, ఆమె పూర్తిగా చనిపోయిందో లేదో నిర్ధారించుకోవడానికి ముఖంపై దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 29వ తేదీన నిందితుడైన కిరణ్, తన భార్య పద్మను నిద్రిస్తున్న సమయంలో దిండుతో ముఖంపై అదిమి పట్టుకున్నాడు. ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. కిరణ్ గత కొంతకాలంగా ఇంటర్నెట్‌లో 'భార్యను ఎలా చంపాలి?', 'ఎలాంటి ఆధారాలు దొరకకుండా హత్య చేయడం ఎలా?' అని గూగుల్‌లో సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు.

పద్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. అతని సెల్‌ఫోన్, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించగా, హత్యకు సంబంధించిన కుట్ర అంతా బట్టబయలైంది.

పోలీసులు నిందితుడు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఒక చిన్న కారణంతో కట్టుకున్న భార్యనే ఇంత దారుణంగా చంపడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh