అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్దపడుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ప్రకారం ఈ ఒప్పందంలో ప్రస్తుత కాల్పుల విరమణను మరో అరవై రోజుల పాటు పొడిగించబోతున్నారు.
ఇందులో హర్ముజ్ జలసంధిని క్రమంగా తెరవడం, ఇరాన్ తీరం, ఓడరేవులపై అమెరికా దిగ్భంధనం ఎత్తివేయడం, ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా ఆంక్షలను ఎత్తివేయడం వంటివి ఉండబోతున్నాయి.
అవగాహాన ఒప్పందం..
ఈ అరవై రోజుల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలంలో ఇరాన్ అణు కార్యక్రమాలను వదులుకోవడం, 400 కిలో గ్రాముల సుసంపన్నమైన యురేనియం నిల్వలలపై చర్చలు జరపడానికి ఈ ఒప్పందం కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇది కుదిరితే ఇస్లామాబాద్ లో సంతకాలు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకారం.. ''పాకిస్తాన్ అత్యంత చిత్తశుద్దితో తన శాంతి ప్రయత్నాలను కొనసాగిస్తుంది. మేము త్వరలోనే తదుపరి చర్చకు అనుమతి ఇస్తున్నాము'' అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.ట్రంప్ గత కొన్ని రోజులుగా సౌదీ, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, ఈజిప్ట్, టర్కీ నాయకులతో మాట్లాడుతూనే ఉంటారు. అలాగే ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సైతం ఇరాన్ లో పర్యటించారు. ప్రస్తుతం పాక్ అంతర్గత వ్యవహరాల మంత్రి మెహ్ సిన్ నఖ్వీ ఇరాన్ లోనే ఉన్నారు. ఈ ఒప్పందం త్వరగా కుదరడానికి ఖతార్ కూడా ఇందులో చేరింది.

మే 22న మార్కో రూబియో మాట్లాడుతూ.. ఈ మొత్తం వ్యవహరాలలో ప్రాథమిక మధ్యవర్తి పాకిస్తానే, ఇప్పటికే అదే కొనసాగుతుంది. వారు మంచి పని చేశారని అన్నారు.
ట్రంప్.. ఇరాన్..
ఇరాన్ యుద్ధం ముగియడానికి ముందు, తరువాత ట్రంప్ అనేక విరుద్ద ప్రకటనలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. కాసేపు కొన్ని అంశాలు ఉన్నాయంటారు.. కొన్నిసార్లు లేదంటారు.
గతంలో ఆయన గల్ఫ్ దేశాల నాయకులతో మాట్లాడింది లేదు. అయితే ప్రస్తుతం మారింది. చర్చలలో గణనీయమైన పురోగతి సాధించిందని తెలియజేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చలలో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని మనం గుర్తుంచుకోవాలి.
ఇది నిజంగా ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బే. కానీ ఆయన చేసేది ఏం లేదు. అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ పడిపోవడమే ఇందుకు కారణం. పెట్రోల్ ధరలు పెరగడం, నవంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ట్రంప్ హైరానా పడుతున్నారు.
మరోవైపు ఇరాన్ కూడా ఇందుకు సిద్దంగా ఉంది. అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ వంటి నాయకులు ఆచరణ రూపంలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఐఆర్జీసీ లోని ఒక వర్గం ఇందుకు ఒక వర్గం ఉంది. వారు నౌకల రాకపోకల నియంత్రణ వదులు కోవడానికి, సుంకం విధింపు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది నాయకులు కూడా ఇది సాధ్యంకాదని చెబుతున్నారు. ఇందుకు ప్రపంచం సమ్మతించదని వారు చెబుతున్నారు.
అణుసమస్య..
యురేనియంను అణుబాంబు స్థాయికి శుద్ది చేయమని ఇరాన్ హమీ ఇవ్వకుండా, తమ వద్ద ఉన్న నాలుగువందల కిలోల యురేనియం వదులుకోవడం చేస్తేనే ట్రంప్ కు మంచిది అవుతుంది.
ఇరాన్ కు అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం లేదని ఆ దేశ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు దానిది అది నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇరాన్ షరతులపై అమెరికా అంగీకరించకపోతే సైనిక చర్యలు తిరిగి ఉంటాయని అమెరికా చెబుతోంది.
యురేనియాన్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని సర్వోన్నత నాయకుడు ఖమేనీ నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ దిగ్భంధనం నుంచి తప్పించుకోవడానికి దీనికి ఆయన ఆమోదం తెలపవచ్చు. చివరకు ఆయన సమ్మతిస్తే పాకిస్తాన్ లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగవచ్చు.
గల్ప్ నుంచి హైడ్రో కార్బన్ సరఫరాల విషయంలో యథతథ స్థితిని పునరుద్దరించడానికి కొంతకాలం పట్టవచ్చు కానీ.. హార్ముజ్ విషయంలో తక్షణం ఉపశమనం లభించే అవకాశం ఉంది. అవగాహన ఒప్పందం కుదరడానికి సమయం పట్టేంత వరకూ ఉంటే గల్ప్ దేశాలు హైడ్రో కార్బన్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు. అందువల్ల ప్రపంచం కూడా ఈ ఒప్పందం కుదరాలని కోరుకుంటోంది.
(ది ఫెడరల్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఫెడరల్ కేవలం ఒక వేదిక మాత్రమే. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి మాత్రమే. ఇవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)

