Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్-బంగ్లా సరిహద్దుల్లో 'స్మార్ట్ బోర్డర్' ప్రాజెక్ట్

పాక్-బంగ్లా సరిహద్దుల్లో 'స్మార్ట్ బోర్డర్' ప్రాజెక్ట్

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ వెంట 6వేల కిలోమీటర్ల దూరం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.

సరిహద్దు భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్యఉద్దేశ్యమన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీట్‌లో షా మాట్లాడారు. డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాల సాయంతో చొరబాట్లను గుర్తించి వెంటనే అడ్డుకునే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించామని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చొరబాట్లను పూర్తిగా నిరోధించే విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి జనాభా గణన మిషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని అమిత్ షా వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh