Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్లే..

రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్లే..

మిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ (118 స్థానాలు) లేకపోవడంతో TVK చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234. టీవీకే 108 సీట్లు గెలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు ఉండాలి. అంటే TVKకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కండీషనల్ సపోర్టుతో 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ విజయ్‌కు మద్దతిచ్చింది. దీంతో TVK బలం 113కి పెరిగింది. అయితే విజయ్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచారు. అందులో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం 112 స్థానాలు. ఇంకా 6 సీట్ల అవసరం. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే (Viduthalai Chiruthaigal Katchi) కు చెరో రెండు స్థానాలు దక్కాయి. మద్దతు కోసం TVK నేతలు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్లు సమాచారం. అయితే వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం రేపు జరగడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh