Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారి హుండీ ఆదాయానికి గండి ఎలా పడుతోంది..?

శ్రీవారి హుండీ ఆదాయానికి గండి ఎలా పడుతోంది..?

తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాల్లో వచ్చే యాత్రికులకు తిప్పలు తప్పడం లేదు. సరైన పత్రాలు లేని వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. దీనికోసం రాష్ట్రం రవాణా శాఖ తిరుమలకు ప్రత్యేకంగా ఎంవీఐ (మోటారు వాహనాల తనిఖీ అధికారి)ని నియమించింది.

భౌగోళికంగా అలిపిరి నుంచి తిరుమల వరకు ఒకే ప్రదేశంగా సరిహద్దులు నిర్ణయించారు. దీంతో టీటీడీ అలిపిరి వద్ద వాహనాల తనిఖీ అనంతరం ముందుకు వెళ్లగానే ఆర్టీఏ అధికారులు ప్రయివేటు వాహనాలు, టాక్సీలను తనిఖీలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సొంత వాహనదారులు జరిమానాల రూపంలో వేలకు వేలు చెల్లించాల్సిన అనివార్య మైన పరిస్థితి ఏర్పడుతోంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత మరియు రవాణా నిబంధనల అమలుపై రవాణా శాఖ (RTO) అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. తిరుమలకు ప్రధాన ద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీఓ అధికారులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కొరడా ఝళిపించారు. దీనివల్ల యాత్రికులకు యాతన, శ్రీవారి హుండీ ఆదాయానికి గండి పడుతోంది.

నష్టం ఎవరికి..?

సొంత వాహనాల్లో వచ్చే యాత్రికులు తిరుమలకు వెళ్లడనానికి ముందే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు సాగించే తనిఖీల వల్ల జరిమానాలు చెల్లిస్తున్నారు. దీని వల్ల రెండు రకాలుగా కష్టాలు తప్పడం లేదు.

1) వాహనానికి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం,

2) టాక్స్ చెల్లించని వాహనదారులు,

3) వాహనం ఫిటినెస్ లేని వాహనదారులకు కష్టాలు ఎదురవుతున్నాయి.

దూరప్రాంతాల నుంచి సొంత వాహనాలు, ప్రైవేట్ బస్సులు మరియు టాక్సీలలో తిరుమలకు చేరుకుంటున్న అనేకమంది భక్తులు సరైన వాహన పత్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పత్రాలు లేని వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు. దీనివల్ల దారి ఖర్చులు పోగా, మిగతా సొమ్ము శ్రీవారి హుండీకి సమర్పించాలని భావించే యాత్రికుల మొక్కు సాకారం కావడం లేదు. దీంతో యాత్రికులకు వేదన, హుండీ ఆదాయానికి గండి పడుతోంది. తనిఖీల సమయంలో పత్రాలు సరిగ్గా లేని వాహనాలను ముందుకు అనుమతించకపోవడంతో, చిన్నపిల్లలు, వయోవృద్ధులతో సహా కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రవాణా శాఖ చేపడుతున్న ఈ తనిఖీలు, విధించే జరిమానాల ప్రభావం పరోక్షంగా శ్రీవారి హుండీ కానుకలపై పడుతోంది.

సమయం వృథా: ముందస్తుగా బుక్ చేసుకున్న దర్శనం టైమ్ స్లాట్లు దాటిపోతుండటంతో శ్రీవారి దర్శనం దొరుకుతుందో లేదోనని యాత్రికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిష్కారం ఏమిటి?

భద్రత దృష్ట్యా రవాణా నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో, దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. దీనికోసం తిరుమలకు బయలుదేరే ముందే వాహనదారులు తమ వాహన పత్రాలన్నీ (RC, FC, ఇన్స్యూరెన్స్, పర్మిట్) సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అలిపిరి వద్ద నిలిపివేసిన వాహనాలలోని భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకోవడానికి ఆర్టీసీ లేదా టీటీడీ ఆధ్వర్యంలో తక్షణ ప్రత్యామ్నాయ వాహన సదుపాయాలు పెంచాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh