Dailyhunt
స్టాలిన్‌ను వెనక్కి నెట్టిన విజయ్

స్టాలిన్‌ను వెనక్కి నెట్టిన విజయ్

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 234 స్థానాలకు గానూ TVK ఏకంగా 115 స్థానాల్లో ముందంజలో ఉంది.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం మూడు అడుగుల దూరంలో విజయ్ పార్టీ నిలవడంతో, తమిళ గడ్డపై సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కాబోతోందని స్పష్టమవుతోంది.

కుప్పకూలిన అధికార డీఎంకే కూటమిముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే (DMK) కూటమి ఈ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్నది. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన డీఎంకే, ఈసారి కేవలం 41-62 స్థానాలకే పరిమితమై భారీ వెనుకంజలో ఉంది. మరోవైపు, ఏఐఏడీఎంకే (AIADMK) కూటమి 63-73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి రెండో స్థానంలో కొనసాగుతోంది. దశాబ్దాల తరబడి డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ విజయ్ నేతృత్వంలోని మూడో ప్రత్యామ్నాయం అతిపెద్ద శక్తిగా అవతరించింది.ముఖ్యనేతల ఓటమి దిశగా.. మంత్రుల వెనుకంజఈ ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో వెనుకంజలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆయన కేబినెట్‌లోని దాదాపు 30 మంది మంత్రులు ఓటమి అంచున ఉండటం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది. విజయ్ స్వయంగా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో దూసుకుపోతుండగా, ఉదయనిధి స్టాలిన్ చేపాక్ స్థానంలో స్వల్ప ఆధిక్యంతో పోరాడుతున్నారు.సినిమా గ్లామర్ కాదు.. రాజకీయ పవర్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్, స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా తారలను ఆదరించిన తమిళ తమ్ముళ్లు, ఇప్పుడు విజయ్‌కు పట్టం కడుతూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో, సాయంత్రానికి విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh