Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెక్స్‌టైల్స్ హబ్ కలలు... అమరావతి భూముల ఆక్రోశం!

టెక్స్‌టైల్స్ హబ్ కలలు... అమరావతి భూముల ఆక్రోశం!

పీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున కల్లబొల్లి కబుర్లు చెప్పే తీరు మొదలుపెట్టింది. "ఆంధ్రప్రదేశ్‌ను టెక్స్‌టైల్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం...

2030 నాటికి 350 బిలియన్ డాలర్ల ఎగుమతులు" అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కలిసి హోటల్‌లో ఫొటోలు కొట్టుకుంటున్నారు.

అదే సమయంలో అమరావతి చుట్టుపక్కల ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో రైతులు "మా భూములు బలవంతంగా తీసుకోకండి" అంటూ రోడ్లపైకి వస్తున్నారు. ఒక వైపు "హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్ర" అని నినాదాలు... మరో వైపు మూడు పంటలు పండే సారవంతమైన భూములను బుల్డోజర్లతో బెదిరించడం. ఇది ఏమిటయ్యా సర్... బ్రాండింగ్ మాస్టర్ చంద్రబాబు స్టైల్ ఇదేనా?

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ "చంద్రబాబు బ్రాండింగ్ మాస్టర్" అని పొగిడేశారు. సరే బ్రాండింగ్‌లో నైపుణ్యం ఉందని అంగీకరిస్తాం. కానీ ఆ బ్రాండ్ ఎక్కడికి వెళ్తోంది? అమరావతి రాజధాని పేరుతో భూములు సేకరించి 12 ఏళ్లు గడిచినా ఇంకా "పేపర్ ప్లాట్లు" మాత్రమే అందుతున్నాయి. ఇప్పుడు టెక్స్‌టైల్స్ హబ్ అంటూ మళ్లీ కొత్త కలలు చూపిస్తున్నారు.

"రప్పా రప్పా పాలసీ" అని వైఎస్సార్సీపీని ఎగతాళి చేస్తున్న మంత్రి సవిత గారూ, మీ పాలసీ పేరు ఏమిటి? "కల్లబొల్లి కబుర్ల పాలసీ" కాదా?

అరటి నార, చెరకు నార, పైనాపిల్ నారతో ప్రపంచం గెలుస్తామంటున్నారు, బాగుంది. కానీ ముందు రైతుల భూములను రక్షించండి సార్. నార ఉత్పత్తులు తయారు చేయాలంటే భూమి కావాలి, రైతు కావాలి, నమ్మకం కావాలి. ఇప్పుడు రైతులు నమ్మకం కోల్పోయి రోడ్డుపైకి వచ్చేస్తున్నారు.

కేంద్ర మంత్రి "మోడీ-చంద్రబాబు విజనరీ నాయకులు" అన్నారు. విజన్ బాగుంది. కానీ ఆ విజన్ అమలులోకి రావాలంటే కనీసం రైతుల ఆక్రోశం వినాలి. లేదంటే టెక్స్‌టైల్స్ హబ్ కాదు, "టెక్స్‌టైల్స్ హబ్ ఆఫ్ పేపర్స్" అని చరిత్రలో నిలిచిపోతుంది.

ఏపీ ప్రభుత్వం ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. కలలు చూపించడం ఒక్కటే కాదు... వాటిని నిజం చేయడం కూడా ముఖ్యం. లేదంటే రైతుల ఆందోళనలు మరింత బలపడి, టెక్స్‌టైల్స్ హబ్ కాకుండా "ఆందోళనల హబ్" అని పేరు వస్తుంది.

బ్రాండింగ్ మాస్టర్‌కు ఒక చిన్న సలహా ఇస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా కొత్త కలలు చెప్పడం... ఇది బ్రాండింగ్ కాదు సార్, బ్రాండ్ డ్యామేజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh