ఈ ఏడాది అధిగమాసం కావడం వల్ల తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహణకు టీటీడీ సన్నద్ధం అవుతోంది. రెండు బ్రహ్మోత్సవాలకు ఖగోళశాస్త్రానికి లంకె ఉంది.
ఈ విశిష్టతల నపథ్యంలో గతానికి భిన్నంగా తిరుమలలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు అధికారుల హడావిడి ఎక్కువైంది. రోజుమార్చి రోజు సమీక్షలు సాగిస్తున్నారు. సామాన్య భక్తులను గ్యాలరీలకు, సర్వదర్శనానికి పరిమితం చేస్తారు. మినహా శీఘ్రదర్శనం ఉండదు.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు (బీ. రాజగోపాల నాయుడు) రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది నవంబర్ మొదటివారంలో ముగియనుంది. చిరస్మరణీయ కానుకగా లడ్డూ చిత్రంతో బంగారు నాణెం విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. తిరుమలలో సాధారణ రోజుల్లోనే కాదు. బ్రహ్మోత్సవాల వేళ కూడా యాత్రికులు ఆంక్షల మధ్య శ్రీవారి దర్శనాలే. రాయకీయ ప్రముఖులు, అధికారుల హోదాకు తగినట్టు వాహనసేవలు, దర్శనాల్లో ఏమాత్రం లోటు ఉండదు. గరుడోత్సవం రోజు రాజకీయ ప్రముఖులు, సిఫారసు ఉన్న వారి వాహనాలు మినహా ఎవరివీ అనుమతించరు. మొత్తానికి సాధారణ రోజుల్లోనే కాదు. ప్రముఖులు, రాజకీయ ప్రతినిధులకు మాత్రమే పెద్దపీట వేయడం సర్వసాధారణంగా మారుతోంది.
అలిపిరి సెంటిమెంట్ పట్టించుకోరా?
తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం రోజు అలిపిరి వద్ద తిరుపతి స్థానికులు అన్నప్రమాదాలతో పాటు అల్పాహారం, తేనేరు పంపిణీ చేయడానికి పోటీ పడతారు. ఇది సాక్షాత్తూ శ్రీవారి సేవగానే భావిస్తారు. సెక్యూరిటీ పేరిట ఆ సేవలు అందించడానికి వీలులేకుండా కొన్నేళ్లుగా ఆంక్షలు విధించారు. కనీసం ఈ ఏడాదైనా అనుమతిస్తారా? "తిరుమలలో తరచూ సమీక్షలు నిర్వహించే అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు" ఆ విషయాన్ని టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న తిరుపతి స్థానికుడు జీ. భానుప్రకాష్ రెడ్డి కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.అలిపిరి వద్ద కెమెరాలు ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఇక అక్కడ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తే నష్టం ఏమిటి? అనే తిరుపతి ప్రజల ప్రశ్న సమాధానం లేని మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.
రెండు బ్రహ్మోత్సవాల నేపథ్యం ఇదీ..
ఈ సంవత్సరం (2026)లో అధికమాసం రావడం వల్ల తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండు బ్రహ్మోత్సవాలు రావడానికి ఖగోళశాస్త్రానికి లంకె ఉంది.హిందూ సంప్రదాయం ప్రకారం మనం 'చాంద్రమానం' (చంద్రుడి గమనం) ఆధారంగా పండుగలను లెక్కిస్తాం. సూర్యుడి గమనం ఆధారంగా 'సౌరమానం' నడుస్తుంది. సౌర సంవత్సరానికి 365 రోజులు ఉంటే, చాంద్ర సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే టా ఈ రెండింటి మధ్య 11 రోజుల వ్యత్యాసం వస్తుంది.ఇలా మూడేళ్లు గడిచేసరికి దాదాపు ఒక నెల (33 రోజులు) తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తూ.. ప్రతి మూడేళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను కలుపుతారు. దాన్నే 'అధిక మాసం' అంటారు. ఈ ఏడాది అలా అధిక మాసం రావడంతో.. తిరుమలలో సాంప్రదాయబద్ధంగా 'సాలకట్ల బ్రహ్మోత్సవాలు', 'నవరాత్రి బ్రహ్మోత్సవాలు' అని రెండు విడతలుగా స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నారు. 1)సాలకట్ల బ్రహ్మోత్సవాలు: సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు ( 19న గరుడసేవ).2) నవరాత్రి బ్రహ్మోత్సవాలు: అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు ( 16న గరుడసేవ) నిర్వహిస్తారు. ఈ బ్రహెత్సవాల వేళ సమీక్షలు సాగిస్తున్న అధికారులు సామాన్య భక్తులకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటి?(ఈ వీడియోలో చూడండి)

