సీమా గుహా
భారత్-అమెరికా సంబంధాలలో కొద్దికాలంగా తీవ్రస్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. అయితే తిరిగి ట్రంప్ అధ్యక్షుడిగా రావడంతో న్యూఢిల్లీలో పెద్దగా ఆందోళన చెందలేదు.
దీనికి కారణం ట్రంప్ మొదటి పదవీకాలంలో భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉండటమే.
ఆయన మొదటి టర్మ్ లో వైట్ హౌజ్ తో సంబంధాలు బలపడటమే కాకుండా 2017 లో క్వాడ్ ఏర్పాటు భరోసానిచ్చాయి.ముఖ్యంగా ట్రంప్ కు మోదీతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. హ్యూస్టన్ లో 'హౌదీ మోదీ ర్యాలీ', అహ్మదాబాద్ లో 'నమస్తే ట్రంప్' కార్యక్రమాలు అద్భుతంగా సాగాయి. అయితే ఆ కాలంలో కూడా సాగిన సుంకాలు, వాణిజ్య పద్దతులపై ట్రంప్ చేసే వ్యాఖ్యలు తరువాత తనదైన శైలిలో మళ్లీ కొట్టిపారేసేవారు.
సంబంధాల్లో కల్లోలం...
గత ఏడాది కాలంగా భారత్- అమెరికా సంబంధాలలో రెండు దశాబ్దాలకు పైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించి ఉద్రిక్తతలు దారితీశారు. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పానని ట్రంప్ ప్రకటించారు. కానీ భారత్ దీన్ని తిరస్కరించింది. తరువాత భారతీయులను బలవంతంగా అమెరికా నుంచి భారత్ కు సంకెళ్లతో బంధించి పంపారు.రష్యా చమురును కొనుగోలు చేయవద్దని బెదిరింపులకు దిగారు. పాకిస్తాన్ పంచన చేరి భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అమెరికాలో జాతీయవాదం బలపడింది. హెచ్ వన్ బీ వీసాలు, భారత్ నుంచి సాంకేతిక బదిలీలు, పెట్టుబడులు, ఉన్నత విద్య ఇలా అనేక అంశాలను ఆయన ముట్టుకోవడం ప్రారంభించారు.అయితే ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగానే న్యూఢిల్లీ భావిస్తోంది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాలను ట్రంప్ మిగిలిన పాలనాకాలం వరకూ భరిస్తే తరువాత అదే సెట్ అవుతాయని చాలామంది దౌత్యవేత్తలు భావిస్తున్నారు.ఒకవేళ సమస్య కేవలం ట్రంప్ నుంచి కాకుండా వలసలు, వాణిజ్యం ప్రపంచీకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాల పట్ల దేశ వైఖరులను పునర్నిస్తున్న అమెరికా రాజకీయాలలో లోతుగా వస్తే ఇది ఎల్లకాలం కొనసాగే అవకాశం ఉంది. వీసాలు, సాంకేతికత, పెట్టుబడులు, ఆంక్షలపై నియంత్రణలు వ్యవస్థీకృతంగా మారితే ప్రభుత్వాలు మారిన వాటిని మార్చడం కష్టం.హెచ్ వన్ బీ వీసాల మొదలు, విద్యార్థుల యూనివర్శిటీ ప్రవేశాలు, విదేశాంగ విధాన సాధనంగా ఆంక్షలను ఆయుధంగా వాడటం వరకూ, ప్రతిచోటా ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నట్లు ఇప్పుడు ఏదీ ఉండబోదు.
ఆంక్షలు.. సుంకాలు..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వందశాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇది భారత్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశం. సెనెట్ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ఇది చట్టంగా మారాడానికి ప్రతినిధుల సభ కూడా ఆమోదిస్తే సరిపోతుంది. అధ్యక్షుడు కోరుకుంటే సుంకం రేటును నిర్ణయించే అధికారం కాంగ్రెస్ ఆయన కట్టబెట్టింది.భారత్ ఇప్పటికే రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. జూన్ 2026 నాటి గణాంకాల ప్రకారం భారత్ రష్యా నుంచి 42.9 శాతంగా ఉంది. ట్రంప్ తన హెచ్చరికను అమలు చేస్తే న్యూఢిల్లీ దీనికి బదులుగా ప్రత్యామ్నాయా వనరులను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది దేశ ఇంధన సరఫరాను క్లిష్టంగా మారుస్తుంది.ట్రాన్స్ షిప్ మెంట్ కుంభకోణం గా దీనిని వైట్ హౌజ్ భావిస్తోంది. దీనిపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ చర్యలతో భారత్ కూడా ప్రభావితం కానుంది. అమెరికాలో అడుగుపెడుతున్న చైనా వస్తువులు నేరుగా కాకుండా మూడో దేశం ద్వారా వస్తున్నాయి.ఇదే అమెరికా కన్నెర్ర చేయడానికి ఒక కారణం. ఈ నిబంధనలో తుది ఉత్పత్తి కోసం చైనా నుంచి వచ్చే ముడిసరుకులపై ఆధారపడే దేశాలను కూడా చేర్చారు. ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో భారత తయారీ రంగం చైనా విడిభాగాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇది అమెరికా తయారీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు.''భారత తయారీ రంగం చైనా నుంచి దిగుమతి అయ్యే మధ్యంతరం ముడిసరుకులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, ఇది కూడా మనపై ప్రభావం చూపవచ్చు, ముఖ్యంగా భారత్ నుంచి అమెరికా కు ఎగుమతి చేసే వాటిలో అత్యధికం మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్ వంటివి ఉన్నాయి.'' అని జేఎన్యూ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ అన్నారు.
విద్యార్థి.. హెచ్ వన్ బీ వీసాలు..
భారతీయ విద్యార్థులు ఎఫ్ వన్, జే వన్ వీసాలు పొందడం కష్టతరంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు కచ్చితంగా చూడటం, కఠినంగా స్క్రీనింగ్, ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడంతో వీటి ఆమోదరేట్లు ఏటా 62 శాత పడిపోతున్నాయి.అంతేకాకుండా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్ వన్ బీ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును తొలగించారు. అలాగే రుసుమును కూడా నాలుగు వేల డాలర్లను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంకా ఏ వన్ వీసాను భారీగా ఉపయోగించడం వల్ల విదేశీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుంది. నిజం ఏమిటంటే అమెరికాకు, భారత్ అవసరం ఉన్నదానికంటే భారత్ కే అమెరికా అవసరం ఎక్కువ.''భారత్ విషయానికొస్తే, సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల రంగాలలో స్థిరమైన అభివృద్ధి సాధించిన న్యూఢిల్లీకి.. అమెరికాతో బంధం చాలా కీలకమైనది. అయితే ట్రంప్ పాలనలో భారత్ పై ఆంక్షలు విధించారు. పాకిస్తాన్ తో పోల్చి, ప్రాధాన్యత లేని భాగస్వామిగా మారుస్తున్నారు. అయితే చైనా ను నిలువరించడానికి ఇండో - పసిఫిక్ ఒప్పందాలను ఉపయోగిస్తున్నారు.'' అని రిటైర్డ్ అంబాసిడర్ అనిల్ వధ్వా అన్నారు.
వ్యూహాత్మక ప్రాధాన్యం తగ్గింది...
వాణిజ్య సంబంధాలను స్థిరికరించేందుకు ట్రంప్ ప్రస్తుతం చైనాతో జరుపుతున్న ప్రయత్నాల వల్ల భారత్ వ్యూహాత్మక ప్రాముఖ్యం తగ్గిపోయింది. ''రక్షణ సహకారానికి చైనా సవాలే కారణం. భారత తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ, ఇండో- పసిఫిక్ లో చైనాను ఎదుర్కొంటుందని అమెరికా ఆశించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తనను తాను నికర భద్రతా ప్రదాతగా తొలి ప్రతిస్పందనదారుగా భావించుకునే దేశ దృక్పథానికి అనుగుణంగా ఉంది'' అని హడ్సన్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన అపర్ణా పాండే అన్నారు. వాణిజ్య, రక్షణ, దౌత్య సహకారంతో ఈ సంబంధం కార్యాచరణ స్థాయిలో ముందుకు సాగుతున్నప్పటికీ దానిని తీసుకెళ్లడానికి కీలకమైన వ్యూహాత్మక పునాది కొరవడిందని ఆమె పేర్కొన్నారు.దేశానికి పరిష్కారం స్వదేశంలో అభివృద్ధి చెందడం, స్వావలంబన సాధించడం, ఒక అనివార్య భాగస్వామిగా మారడంలోనే ఉంది. అదే సమయంలో, దేశం అభివృద్ధి మార్గంలో సాయపడగల స్థితిలో ఉన్న ఇతర దేశాలతో శాశ్వత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి.భవిష్యత్తులో చైనా అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతుంది కాబట్టి, సంబంధాలలో ఈ తాత్కాలిక విరామం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఎక్కువ కాలం కొనసాగదని చాలా మంది దౌత్యవేత్తలు భావిస్తున్నారు.బహుశా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చెప్పింది సరైనదే కావచ్చు, కానీ భారత్ వేచి చూసే స్థితిలో ఉండగలదా? ట్రంప్ రెండవ పదవీకాలం తొలి నెలల్లో కనబడిన నిర్లక్ష్యాన్ని న్యూఢిల్లీ ఇకపై భరించలేదు.వాషింగ్టన్ మారుతుందని ఎదురుచూడటం ఇకపై ఒక వ్యూహం కాకపోవచ్చు. అది ఒక ప్రమాదకరమైన భ్రమ కావచ్చు. భారతదేశ అభివృద్ధికి అమెరికా అవసరం. భారతదేశం ముందున్న సవాలు ట్రంప్‌ను తట్టుకుని నిలబడటం కాదు. న్యూఢిల్లీలోని చాలామంది అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నదానికంటే చాలా లోతుగా మారుతున్న అమెరికాలో ఎలా ముందుకు సాగాలనేదే అసలు సవాలు."విదేశీయులు, అర్హత కలిగిన భారతీయులు అమెరికన్ ఉద్యోగాలను లాగేసుకుంటున్నారనే అపనమ్మకం అమెరికన్ సమాజంలో అంతర్లీనంగా ఉంది," అని వధ్వా అన్నారు.
అమెరికా వ్యూహకర్తలు ఎలా..?
ప్రస్తుతం అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనా లాగా భారతదేశం ఎదగడానికి అమెరికా అనుమతించదని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. "...అంటే భారతదేశాన్ని ఉద్దేశపూర్వకంగా అణచిపెట్టే విధానం అని అర్థం," అని వధ్వా పేర్కొన్నారు.అమెరికాతో తన దీర్ఘకాలిక సంబంధాన్ని పరిగణనలోకి తీసుకునేటప్పుడు న్యూఢిల్లీ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని అమెరికన్ వ్యూహకర్తలు ఆశాభావంతో ఉన్నారు."భారతదేశానికి పరిష్కారం స్వదేశంలో అభివృద్ధి చెందడం, స్వావలంబన సాధించడం, ఒక అనివార్య భాగస్వామిగా మారడంలోనే ఉంది. అదే సమయంలో, భారత్ అభివృద్ధి మార్గంలో సాయపడగల స్థితిలో ఉన్న ఇతర దేశాలతో శాశ్వత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి.చైనాపై గానీ, అమెరికాపై గానీ ఆధారపడటాన్ని పెంచుకునే విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాలి," అని వధ్వా హెచ్చరించారు. అయినప్పటికీ, అంతా నిరాశాజనకంగానే లేదు. చాలా మంది భారతీయ అమెరికన్ వ్యూహకర్తలు ఆశాభావంతో ఉన్నారు."అన్ని ప్రజాస్వామ్య దేశాల మాదిరిగానే, అమెరికా విధానాలు కూడా ప్రతి ఎన్నికల చక్రంతో పాటు మారుతూ ఉంటాయి. కానీ మారే వాటి కంటే నిలిచిపోయేవే ఎక్కువ పరిణామాలకు దారితీస్తాయి:... ఇవి బలమైన పునాదులు, నిరంతర భాగస్వామ్యం బంధాలను మరింత బలపరుస్తుందనే నమ్మకానికి అన్ని కారణాలూ ఉన్నాయి," అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS)లో భారత్, వర్ధమాన ఆసియా ఆర్థిక శాస్త్రాల అసోసియేట్ ఫెలో అయిన ఆర్యన్ డి'రొజారియో అన్నారు.కానీ అంచనాలు ఒకసారి భారీ మూల్యం చెల్లించాయి. గత సంవత్సరం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, తదుపరి ప్రభుత్వం పాత సాధారణ స్థితిని పునరుద్ధరిస్తుందనే అంచనాతో భారత్ ఇకపై తన అమెరికన్ వ్యూహాన్ని నిర్మించుకోలేదు.(ది ఫెడరల్ అన్ని వైఫులా అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు కేవలం రచయితవి మాత్రమే. ఇవి కచ్చితంగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)

