Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
''వందేమాతరాన్ని విభజించి ఒకసారి తప్పు చేశారు''

''వందేమాతరాన్ని విభజించి ఒకసారి తప్పు చేశారు''

జాతీయ గీతమైన వందేమాతరంలో కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య పూర్తి దేశవ్యతిరేక చర్య అని పేర్కొన్నారు.

1937 నాటి సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారమే నడుచుకుంటామని కాంగ్రెస్ ప్రకటించిన తరువాత షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం, దేశ విభజనను ఆపడానికి కాంగ్రెస్ వందేమాతరాన్ని ముక్కలు చేసింది. అయితే తరువాత భారత్ రెండు దేశాలుగా అంటే పాకిస్తాన్ గా విడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పాత విధానాన్నే కొనసాగిస్తోందని, వందేమాతరం విభజన వల్లే దేశ విభజన జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

''నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశ వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. తాము 1937 నాటి తీర్మానాన్ని అనుసరించి వందేమాతరంలోని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 1937 లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందేమాతరాన్ని విభజించడం ద్వారా దేశ విభజనకు కాంగ్రెస్ పునాది వేసిందని నేను దేశానికి గుర్తు చేయాలనుకుంటున్నాను'' అని షా అన్నారు.
కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దాము..
నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ఘోరమైన తప్పిదాన్ని సరిచేసింది. కాంగ్రెస్ వారి పాత విధానమైన బుజ్జగింపు రాజకీయాలు కొనసాగిస్తోంది. బంకించంద్ర చటర్జీ సృష్టించిన వందేమాతరాన్ని అవమానించడమే కాకుండా దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన లక్షలాది మందిని అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వందేమాతరాన్ని ముక్కలు దేశం ఒకసారి ముక్కలు చేసి తప్పు చేసింది. దాని పరిణామాలు మనం అనుభవించాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఏకం కావాలి. వారి బుజ్జగింపు రాజకీయాలు ఇక పనిచేయవని స్పష్టం చేయాలి. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని షా అన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని భారతమాత పవిత్ర ప్రార్థనకు అవమానంగా అభివర్ణించారు. కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్ గా మారింది. ఈ నిర్ణయం స్వాతంత్ర్య పోరాటంపై కాంగ్రెస్ కు ఉన్న హక్కును ఛిన్నాభిన్నం చేసిందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh