రాష్ట్రంలోని ప్రజలను పట్టి కుదిపేస్తున్న 22ఏ నిషేధం చట్టం. సుమారు 93 లక్షల ఎకరాల పట్టా భూములను 22ఏ నిషేధం కింద పెట్టేసిన రెవిన్యు యంత్రాంగం. రెవిన్యుశాఖలోని కొందరు అధికారుల అనాలోచిత, అవగాహనా రాహిత్యం వల్లే మామూలు జనాలకు తిప్పలు.
ఆస్తులు అమ్ముకునేందుకు రెడీ అయి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్ళిన తర్వాత కాని తమ ఆస్తులపై నిషేధం ఉందని ప్రజలకు తెలియటంలేదు.
ప్రజల ఆస్తులను నిషేధ 22ఏలో పెట్టిన విషయాన్ని సంబంధిత యజమానులకు చెప్పని ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో సుమారు 40శాతం ప్రజల ఆస్తులు 22ఏ పరిధిలోనే ఉన్నాయా ? 22ఏ సమస్య పరిష్కారానికి జిల్లా స్ధాయిలోని వివాదాల పరిష్కారానికి కలెక్టర్లకే సర్వాధికారాలు ఇవ్వాలనే సూచన
కలెక్టర్లకు పూర్తి అదికారాలు ఇస్తేనే సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని సూచిస్తున్ననిపుణులు. ఆస్తులను అకారణంగా 22ఏలో పెట్టేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే అని పెరుగుతున్న డిమాండ్లు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైలెవల్ కమిటి వల్ల సమస్య వెంటనే పెరుగుతుందా ?

