Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
65 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే ?

65 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే ?

తెలంగాణపై ఎల్ నినో ప్రభావం చాలా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభావం ఏ స్ధాయిలో ఉందంటే రాబోయే రబీ సీజన్లో సుమారు 65 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే తప్పదు అనేంతగా.

తెలంగాణకు మహారాష్ట్ర నుండి గోదావరి జలాలు, కర్నాటక నుండి కృష్ణా జలాలు వస్తాయని అందరికీ తెలిసిందే. ఈ రెండు నదుల నుండి తెలంగాణకు జలాలు వస్తేనే రాష్ట్రంలోని 15 ప్రాజెక్టులు నీటితో కళకళల్లాడుతాయి.

15 ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్ధ్యం సుమారు 741 టీఎంసీలు. అయితే ఎల్ నినో ప్రభావం కారణంగా పైన చెప్పిన రెండు నదుల నుండి నీరు బాగా తగ్గిపోయింది. ఎగువ రాష్ట్రాల నుండి నీరు అందని కారణంగా ప్రస్తుతం 15 ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సుమారు 380 టీఎం సీలకు పడిపోయింది.

ప్రస్తుత నీటి నిల్వను ఆధారం చేసుకునే ప్రభుత్వం సాగు కాకుండా తాగునీటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కారణంగానే రాబోయే రబీ సీజన్లో పంటలకు హాలిడే ప్రకటించక తప్పటంలేదని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి రిపోర్టు అందించింది. పరిస్ధితులు ఇలాగే ఉంటే రబీ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే తప్పకపోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA