Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్జీకర్ ఆస్పత్రి అత్యాచారం కేసులో ఐపీఎస్ ల సస్పెండ్

ఆర్జీకర్ ఆస్పత్రి అత్యాచారం కేసులో ఐపీఎస్ ల సస్పెండ్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ప్రభుత్వం ఆస్పత్రిలో డాక్టర్ అత్యాచారం,హత్య కేసుపై ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అత్యాచారం-హత్య కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో కేసును సరిగ్గా నిర్వహించలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, మాజీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై ప్రారంభించిన శాఖాపరమైన విచారణ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారి తెలిపారు.2024 ఆగస్టులో జరిగిన ఈ దారుణ నేరానికి సంబంధించి, ఈ ముగ్గురు అధికారులు కేసును "సరిగ్గా నిర్వహించకపోవడం", "బాధితురాలి తల్లిదండ్రులకు లంచం ఇవ్వజూపడం", "అనధికారిక పత్రికా సమావేశం" నిర్వహించడం వంటి ఆరోపణలపై ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు.సీబీఐ నిర్వహిస్తున్న, కోర్టులో వాదనలు జరుగుతున్న ఈ నేరానికి సంబంధించిన అసలు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని అధికారి స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో రాష్ట్ర హోం కార్యదర్శి క్రమశిక్షణా చర్యలు, శాఖాపరమైన విచారణకు నేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA