Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమాస్తులు, లంచాలపై ఏసీబీ ఉక్కుపాదం

అక్రమాస్తులు, లంచాలపై ఏసీబీ ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. గత వారం రోజులుగా వరుస దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు శుక్రవారం మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఆస్తులపై సోదాలు చేపట్టగా, మెదక్ జిల్లాలో ఓ ఏడీఈని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అంతకుముందు వరంగల్ సబ్ రిజిస్ట్రార్, బోయిన్‌పల్లి పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేస్తూ అక్రమార్కులను జైళ్లకు పంపిస్తుంది. శుక్రవారం ఏసీబీ ఇద్దరు అక్రమార్కులను పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.

మెదక్ జిల్లాలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ముద్దం రమణారెడ్డి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్‌పై ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. అధికారులు వంశీమోహన్ కు చెందిన ఎనిమిది ఇళ్లపై సోదాలు నిర్వహించి, బంధువులు, ఒక రియల్టర్‌కు సంబంధించిన అనుమానాస్పద భూ బదిలీలు, బహుమతి పత్రాలను కనుగొన్నారు.మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ తన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) శుక్రవారం వంశీ మోహన్‌కు సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహించింది.అబ్దుల్లాపూర్‌మెట్ ,పిగ్లిపూర్‌లలో డిప్యూటీ కలెక్టర్ మామ పేరు మీద రిజిస్టర్ చేసి, ఆ తర్వాత అభివృద్ధి కోసం ఒక రియల్టర్‌కు అప్పగించిన ఎనిమిది ఎకరాల భూమిని గుర్తించినట్లు సమాచారం.ఆ రియల్టర్ బహుమతి పత్రాల ద్వారా 10 ప్లాట్లను డిప్యూటీ కలెక్టర్‌కు బదిలీ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

ఏసీబీ వలలో ఏడీఈ

మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ ఏడీఈ ముద్దం రమణారెడ్డి శుక్రవారం ఓ కాంట్రాక్టరు నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 11 పనుల బిల్లు రూ.3.13 లక్షల మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఏడీఈని పట్టుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకొని, అవినీతి అధికారి రమణారెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
మరో ముగ్గురు అధికారులు
బుధవారం మరో ముగ్గురు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ దావులూరి ఆనంద్ సంపాదనకు మించిన ఆస్తులున్నాయని గుర్తించి అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బోయిన్ పల్లి పోలీసుస్టేషనులో ఎస్ఐ కిరణ్ నందిత, పోలిస్ కానిస్టేబుల్ విజయకుమార్ లు రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టే దిశగా ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమాస్తులు కూడబెట్టడం, లంచాలు డిమాండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తాజా కేసులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో అప్రమత్తత పెరగగా, ప్రజల్లో ఏసీబీ పనితీరుపై విశ్వాసం మరింత బలపడుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA