Dailyhunt
అమెరికాకు బిగ్ షాకిచ్చిన ఇరాన్

అమెరికాకు బిగ్ షాకిచ్చిన ఇరాన్

డచిన నెలరోజులుగా జరుగుతున్న గల్ఫ్ యుద్ధంలో అమెరికాకు ఇరాన్ ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఇరాన్ కూల్చేవేసింది.

ఎఫ్ 35 అన్నది అమెరికా గొప్పగా చెప్పుకునే ఫైటర్ జెట్లలో అత్యంత కీలకమైనది. శతృవుల నిఘాకు దొరకదు, శతృదేశాల రాడార్లు కూడా పసిగట్టలేవు అని అమెరికా గొప్పలు చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఫైటర్ జెట్ ను ఇరాన్ ఇరాన్ కూల్చేయటం సంచలనంగా మారింది.

ఇరాన్ మిలిట్రీ ప్రకటన ప్రకారం గడచిన 24 గంటల్లో రెండు ఎఫ్ 35 ఫైటర్లను కూల్చేసింది. ఆమధ్య కూడా ఒక ఎఫ్-35 జెట్ ను ఇరాన్ కూల్చేసిన విషయం తెలిసిందే. ఇపుడు ఇరాన్ ప్రకటనపై అమెరికా ఎలాంటి స్పందన కనిపించటంలేదు. అప్పట్లో కూడా తమ ఎఫ్ 35 ఫైటర్ ను ఇరాన్ కూల్చేయలేదని ముందు అమెరికా బుకాయించింది. అయితే తర్వాత ఆ విషయం నిజమే అని బయటపడింది. ఇపుడు కూడా అమెరికా అదే విధంగా మౌనంగా ఉన్నా మెల్లిగా అసలు విషయం బయటపడుతుంది. ఇపుడు విషయం ఏమిటంటే ఆమధ్య ఎఫ్ 35 ఫైటర్ జెట్ కూలిపోయినపుడు పైలెట్ తప్పించుకున్నాడు. కాని తాజా కూల్చివేతలో ఫైటర్ జెట్ పైలెట్ ఇరాన్ సైనికులకు దొరికాడు.

ఎఫ్ 35 జెట్లే కాకుండా ఆమధ్య అమెరికాకు ఎంతో ప్రిస్టేజియస్ అయిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను కూడా ఇరాన్ మిస్సైళ్ళు గట్టిగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఇరాన్ మిస్సైళ్ళు, ద్రోన్ల దెబ్బకు లింకన్ విమాన వాహన నౌక బాగా దెబ్బతినేసింది. ఫలితంగా విమానాల టేకాఫ్ కు నౌక పనికిరాకుండా పోయింది. అలాగే నౌకలోని కమ్యూనికేషన్ వ్యవస్ధ కూడా దెబ్బతినేయటంతో బాగుచేయటం కోసం అమెరికా నౌకను వెనక్కు పిలిపించేసింది. మొత్తంమీద చిట్టెలుక లాంటి ఇరాన్ అంతపెద్ద అమెరికాను ముప్పతిప్పలు పెడుతోందన్నది వాస్తవం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA